calender_icon.png 5 January, 2025 | 6:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పతంగి సరదా ప్రాణం మీదకు తెచ్చింది..

02-01-2025 09:58:03 PM

ద్విచక్రవాహన దారుడి మెడకు చుట్టుకున్న మాంజ

ప్రాణాపాయస్థితిలో క్షతగాత్రుడు 

మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలింపు 

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరం పట్టణంలో హృదయ విషాదకర సంఘటన చోటుచేసుకుంది. రామవరం పట్టణంలో గాలిపటాలు ఎగురవేస్తున్నటువంటి క్రమంలో, చైనా మాంజా, గొంతుకు తగిలి ఆసుపత్రి పాలైన ద్విచక్ర వాహనదారుడు, వివరాల్లోకి వెళితే, కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం గుర్రాయి గూడెం గ్రామానికి చెందిన ఏరువా కృష్ణారావు కొత్తగూడెం పట్టణంలోని హెరిటేజ్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ తరుణంలో రోజులాగే విధులను నిర్వహించుటకు తన ద్విచక్రవాహనంపై వెళ్తున్న క్రమంలో, ఈ సంఘటన చోటుచేసుకుంది.  గొంతు, మెడ, భాగాలు తీవ్ర గాయాలయ్యాయి. తీవ్ర రక్తస్రావం అవడంతో, స్థానికులు హుటాహుటిన డాక్టర్ నాగరాజు ఆసుపత్రికి తరలించారు. పరిశీలించిన డాక్టర్, పరిస్థితి విషమించడంతో, మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు.