calender_icon.png 13 February, 2025 | 8:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇసుక ‘మాఫియా’ రాజ్యం!

13-02-2025 12:00:00 AM

  • అధిక ధరలకు ఇసుక అమ్మకాలు
  • పట్టించుకోని అధికార యంత్రాంగం

కూసుమంచి, ఫిబ్రవరి 11 : పాలేరు నియోజకవర్గంలో ఇసుక మాఫియా రెక్క లు తొడుక్కుంది. ఎక్కడ ఇసుక కనపడిన అక్కడ గద్దల్లా వాలిపోతారు.. రాత్రి పగలు అనే తేడా లేకుండా పదుల సంఖ్యలో ట్రా క్టర్లలో అక్రమ ఇసుకను తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.

గతంలో అక్రమ ఇసుక రవాణాపై అనేక పిర్యాదులు వచ్చిన అటు రెవెన్యూ, మైనింగ్  అధికారులు ఇటు పోలీ సులు పట్టించుకున్నది లేదు.. ఒకవేళ పిర్యాదులు వచ్చిన తుతూ మంత్రంగానే చుట్టపు చూపుగా వచ్చి పోతారు.. లేదా తాత్కాలిక చర్యలకు ఉపక్రమించిన అది ఆరోజు వరకు మాత్రమే..  దీంతో ఇసుక అక్రమ రవాణా యదేచ్చగా సాగుతుంది.. 

తిరుమలాయిపాలెం మండలంలో కాకర వాయి, కూసుమంచి మండలంలో మల్లా యిగూడెం, గోరిలాపాడు తండ, నేలకొండ పల్లి మండలంలో సుర్దేపల్లి గ్రామాల్లో ఇసుక ర్యాంపులు విరివిరిగా ఉన్నాయి. ఇక్కడ నుండి ఎటువంటి అనుమతులు లేకుండానే ప్రతి రోజు 100 ట్రాక్టర్ల అక్రమ ఇసుక తరలింపు నిత్యకృత్యం..

డీడీ తీయకుండానే.. నంబర్ ప్లేట్ లేకుండానే ..

పాలేరు నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమ ఇసుక వ్యాపారం గురించి అందరి కీ తెలిసిన బహిరంగ రహస్యం.. అక్రమ వ్యాపారస్తులు రెవెన్యూ అధికారుల నుండి డీడీ తీయకుండానే ,మైనింగ్ అధికారుల నుండి అనుమతులు లేకుండానే ఏ భయం లేకుండా వ్యాపారం సాగిస్తూ డబ్బులు దండుకుంటున్నారు..

ఈ అక్రమ ఇసుక రవాణా కు ఉపయోగిస్తున్న ట్రాక్టర్లకు ఒక్క ట్రాక్టర్ కు కూడా నంబర్ ప్లేట్ ఉండదు అంటే నమ్మశక్యం కాదు.. పట్ట పగలు, రాత్రి అనే తేడా లేకుండా మండల ప్రధాన కేంద్రం నుండి పోలీసు స్టేషన్ ముందు నుండి కూడా ఈ ట్రాక్టర్లు వెళ్తున్న పట్టించున్న పాపాన పోలేదు అనే ఆరోపణలు ఉన్నాయి. 

ఇసుక మాఫియాకు అధికారుల అండ ..

ఇసుక మాఫియాకు అధికారుల అండ మెండుగానే ఉంది అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.. అక్రమ ఇసుక వ్యాపారం చేసే వీరు అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ నేతలతో అంటకాగుతూ మాది కూడా అధికార పార్టీనే అంటూ అటు అధికారులకు ,ఇటు ప్రజాప్రతిని ధులకు ముడుపులు చెల్లించుకున్నారు అనే ది ప్రధాన ఆరోపణ.. ఇటీవల అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్న రెండు రోజుల్లో బయటకి వచ్చి.. మళ్ళీ యదా మాములుగానే అక్రమ ఇసుక రవాణా సాగిస్తున్నారు..

ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక దొరికేనా..? 

ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్లకు అసలు ఇసుక దొరికేనా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ఇందిరమ్మ ఇళ్లకు 6 ట్రిప్పుల ఉచిత ఇసుక అందించాలని నిర్ణయం తీసుకు న్నట్లు పలు సామాజిక మాధ్య మాల్లో విస్తృతంగా చర్చ జరిగింది. కానీ ప్రభుత్వ ఆశ యాలకు ఇసుక మాఫియాతో పెను సవాలు ముందుంది..

ఒక్కో  ఇసుక ట్రాక్టర్‌కు 4000 నుండి 5000 వసూళ్లు చేస్తున్నారు. ఒకవేళ ప్రభుత్వం ఉచిత ఇసుక అందించాలి అంటే ఇసుక మాఫియాతో అది సాధ్య పడుతుందా అనేది అనుమానమే.. ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టకపోతే ఉచిత ఇసుక అందించాలి అనే సంకల్పానికి ఆదిలోనే హంసపాదు తప్పదు..