calender_icon.png 21 October, 2024 | 4:14 AM

కంగువ జ్వాల రాజుకుంది..

24-07-2024 12:00:00 AM

సూర్య కథానాయకుడిగా రూపొందుతున్న పీరియాడిక్ యాక్షన్ చిత్రం ‘కంగువ’. ఈ సినిమాలో ఆయన గొప్ప పోరాట యోధుడిగా కనపడనున్న సంగతి తెలిసిందే. కాగా మంగళవారం సూర్య పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి తొలి గీతాన్ని విడుదల చేసింది చిత్ర బృందం. చిత్రంలోని ఆటవిక తెగ గురించి చెబుతూ ‘ఆది జ్వాల..అనంత జ్వాల..వైర జ్వాల.. వీర జ్వాల..దైవ జ్వాల..దావాగ్ని జ్వాల..’ అంటూ సాగిన ఈ గీతానికి శ్రీమణి సాహిత్యం అందించగా.. అనురాగ్ కులకర్ణి, దీప్తి సురేష్ ఆలపించారు. ప్రేమ్ రక్షిత్ నృత్య రీతులు సమకూర్చారు. దేవీశ్రీప్రసాద్ స్వరకర్త. దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషించారు. శివ రచన, దర్శకత్వంలో తెరకెక్కి న ‘కంగువ’ చిత్రం అక్టోబరు 10న థియేటర్ల లోకి రానుంది. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంస్థలు కలిసి నిర్మించిన ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ వారు తెలుగు వారి ముందుకు తీసుకురానున్నారు. 

ఆ ఒక్కడికై ఎదురుచూస్తున్నాయి!

మరోవైపు ‘ప్రేమ, నవ్వు, ఓ యుద్ధం’ ఆ ఒక్కడి కోసం వేచి చూస్తున్నాయి అంటూ ఓ ప్రత్యేక వీడియోని విడుదల చేసింది ‘లవ్ లాఫ్టర్ వార్’ టీమ్. సూర్య హీరోగా కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని 2డీ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలో సూర్య కలిసి నిర్మిస్తున్నారు. గ్యాంగ్‌స్టర్ డ్రామాగా రానున్న ఈ సినిమా నుంచి తాజాగా విడుదలైన వీడియోలో స్టులిష్ లుక్‌లో దర్శనమిచ్చారు సూర్య. ఈ సినిమాలో  పూజా హెగ్డే హీరోయిన్ కాగా, సంతోష్ నారాయణన్ సంగీత దర్శకుడు.