calender_icon.png 7 February, 2025 | 10:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హోరా హోరీగా సాగిన కబడ్డీ ఫైనల్ పోటీలు...

07-02-2025 08:06:51 PM

రాష్ట్ర విజేతగా నిలిచిన సూర్యాపేట్...

ఆదిలాబాద్ (విజయక్రాంతి): హోరా హోరీగా సాగిన రాష్ట్ర స్థాయి కబడ్డీ ఫైనల్ పోటీల్లో సూర్యాపేట జట్టు విజేతగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో గత నాలుగు రోజులుగా 71వ రాష్ట్రస్థాయి సీనియర్ పురుషుల కబడ్డీ పోటీలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 33 జిల్లాల నుండి క్రీడాకారులు హాజరయ్యారు. శుక్రవారం జరిగిన ఫైనల్ పోటీల్లో నల్లగొండ- సూర్యాపేట జట్లు పోటీ పడగా హోరా హోరీగా సాగిన ఫైనల్లో సూర్యాపేట జట్టు విజేతగా నిలిచింది. పోటీల ముగింపు కార్యక్రమానికి ఇంటర్నేషనల్ కబడ్డీ అసోసియేషన్ సెక్రెటరీ జగదీష్ యాదవ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అదేవిధంగా తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ మహేందర్ రెడ్డి, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రఘుపతి, రాష్ట్రపాల్ లు రన్నర్, విన్నర్ జట్లకు బహుమతి అందజేశారు.