calender_icon.png 10 March, 2025 | 4:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీ శ్రేణుల ఆనందోత్సాహాలు

07-03-2025 12:00:00 AM

బాన్సువాడ, మార్చి 6(విజయక్రాంతి):  బిజెపి బలపరిచిన పట్టభద్రులు ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్న మైల్ అంజి రెడ్డి. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి కొమురయ్య భారీ మెజార్టీతో గెలిచిన సందర్భంగా గురువారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద. తాడుకోల్ చౌరస్తా వద్ద టపాకాయలు కాల్చి స్వీట్లు పంచి పెట్టారు.

ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ బిజెపి బలపరిచిన పట్టభద్రులు ఎమ్మెల్సీ, టీచర్స్ ఎమ్మెల్సీని ఓటు వేసి గెలిపించిన ఉద్యోగస్తులకు . నిరుద్యోగులకు. యువతకు. మేధావులకు ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు తెలియ చేశారు. ఇదే స్ఫూర్తితో రానున్న.

రోజుల్లో జరిగే స్థానిక సంస్థల భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపిస్తారని రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు లక్ష్మీనారాయణ శంకర్ గౌడ్, చిదుర సాయిలు, బిజెపి రూరల్ అధ్యక్షులు మజ్జిగ శ్రీనివాస్, బిజెపి నాయకులు కొనాల గంగారెడ్డి, పాశం భాస్కర్ రెడ్డి, చిరంజీవి, సాయి రెడ్డి, శివశంకర్, పిరాజి, దత్తు, లక్ష్మణ్, శివకుమార్, గణేష్, అంజయ్య, ఉమేష్, నాగరాజు, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

బీర్కూర్ లో

బాన్సువాడ  : కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం. బీర్కూర్ మండల కేంద్రంలో బిజెపి పార్టీ మండల అధ్యక్షుడు సాయి కిరణ్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు టపాకాయలు కాల్చి సంబరాలు ఘనంగా జరుపుకున్నారు.

ఈసందర్భంగా సాయి కిరణ్ మాట్లాడుతూ పట్టభద్రుల ఎం ఎల్ సి అభ్యర్థి అంజిరెడ్డి గెలుపు రాష్ట్రంలో మోదీ అభివృద్ధి కి పట్టం కట్టారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ పార్టీ తరపున అభ్యర్థులను బరిలో దింపి గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు అందరితో కలిసి పనిచేస్తామని అన్నారు. ఈ సంబరాల్లో కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు.

న్యాయవాదుల సంబురాలు.

నిజామాబాద్ మార్చి 6: (విజయక్రాంతి) : కరీంనగర్, నిజామాబాద్ అదిలాబాద్ ,మెదక్ జిల్లాల ఉపాధ్యాయ నియోజవర్గం ఎమ్మెల్సీ  ఎన్నికల్లో బీజెపీ అభ్యర్థి మల్కా కొమురయ్య ,పట్టభద్రుల నియోజకవర్గం లో ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్ని అంజిరెడ్డి గెలుపొందిన నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా బీజేపీ లీగల్ సెల్, న్యాయవాద పరిషత్ ఆధ్వర్యంలో జిల్లాకోర్టు చౌరస్తాలో గురువారం టపాకాయలు కాల్చి, మిఠాయిలు పంచి సంబరాలు జరుపుకున్నారు.

ఈ సందర్భంగా పరిషత్ జిల్లా అధ్యక్షుడు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారం లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధ్యయ నిరుద్యోగ యువత పట్ల నిర్లక్ష్య  వైఖరికి నిరసన వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉత్తర తెలంగాణ ప్రజలు తీర్పునిచ్చి భాజపా పై విశ్వాసం  తెలియజేశారని అన్నారు.

దేశ వ్యాప్తంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో అమలవుతున్న ప్రగతి పథకాలు ప్రజలకు చేరువవతున్న తీరుకు స్పందించిన ప్రజలు భాజపా కు అనుకూలంగా సంఘటితం అవుతున్నారని తెలిపారు. న్యాయవాదులు బిట్ల రవి, పిల్లి శ్రీకాంత్, విఘ్నేష్ పడిగేల వెంకటేశ్వర్,   అంజలి, లక్మన్ రాజు, యాదగిరి,కేశవరావు, నారాయణ దాసు,అనిల్ వి మ్ మహేష్ దిలీప్ అవుల నారాయణ చక్రవర్తి పాల్గొన్నారు.