02-03-2025 12:00:00 AM
అమ్మాయిలు మాట్లాడితే.. చాలా వినసొంపుగా.. అందంగా ఉంటారనే భావన అందరిలో ఉన్నది. ఇందులో ఎంతవరకూ నిజం ఉందనే విషయంపైన ఆరిజోనా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు. ఆడవాళ్లునా, మగవాళ్లునా సుమారుగా పాతికేళ్లు వచ్చేంతవరకూ ఒక రోజులో దాదాపుగా సమానమైన పదాలనే ఉపయోగిస్తారు.
ఆ తర్వాత అంటే.. 20 ఏళ్లు వచ్చేంతవరకూ ఆడవాళ్ల రోజువారీ సంభాసణల్లో మగవాళ్లతో పోలిస్తే మూడువేల పదాలు ఎక్కువగా ఉంటాయట. ఇలా ఉండటానికి ప్రధాన కార ణం.. పిల్లలట. వాళ్లకి జాగ్రత్తలు చెబుతూ, తీర్చిదిద్దే క్రమంలోనే ఈ పదాల సంఖ్య పెరుగుతూ వస్తుందని ఈ అధ్యయనం తేల్చింది. ఆ బాధ్యతలన్నీ తీరిపోయే సమయానికి అంటే..
అరవైఏళ్లు దాటేసరికి ఆడవాళ్లు, మగవాళ్లు వాడే పదాలు తిరిగి సమానంగా ఉంటున్నాయని తేలింది. నాలుగు దేశాలకు చెందిన స్త్రీ, పురుషులని ఎంచు కుని వారు మాట్లాడిన ఆరున్నర లక్షల రికార్డులని పరిశీలించాక వెల్లడించిన విషయాలివి. అలాగే వ్యాయామం చేయడంలానే చక్కగా మాట్లాడటం కూడా ఆరోగ్య లక్షణమే అంటున్నారు శాస్త్రవేత్తలు.