15-03-2025 12:00:00 AM
ఇటీవలే ప్రాంగణంలో సీసీ రోడ్డు పూర్తి
వినియోగం లేక ప్రయాణికుల అవస్థలు
చౌరస్తా వరకే వచ్చి వెళుతున్న బస్సులు
ఎమ్మెల్యే సార్ జరపట్టించుకోండి: స్థానికులు
దృష్టి పెట్టని ప్రజాప్రతినిధులు, నాయకులు
చిట్యాల, మార్చి 14(విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో ఆర్టీసి బస్టాండ్‌ను నిర్మించి వదిలేశారు.ప్రయాణికులతో రద్దీగా ఉండాల్సిన బస్టాండ్ ఏళ్ల తరబడి నిరుపయోగంగా మారింది. ఇటీవలే ప్రాంగణంలో సీసీ రోడ్డు పనులను సైతం పూర్తి చేశారు. కానీ బస్టాండ్ ప్రారంభానికి మోక్షం లభించడం లేదు. వివరాల్లోకి వెళితే జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలకేంద్రంలోని పాత బస్టాండ్ సుమారు 9 సంవత్స రాల క్రితం శిధిలావస్థకు చేరింది.దీంతో 2016 జూన్ 10న అప్పటి రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి నూతన బస్టాండ్ నిర్మాణానికి 24.8 లక్షల నిధులతో శంకుస్థాపన చేశారు. ఎడదిన్నారలోనే నిర్మా ణం పూర్తయ్యింది. అయితే కాంట్రాక్టర్ నిర్ల క్ష్యం మూలంగా మరుగుదొడ్లు, ప్రాంగణం లో సీసీ రోడ్డు నిర్మాణం పూర్తి చేయలేదు. అప్పటి నుంచి లక్షల నిధులతో నిర్మించిన బస్టాండ్ నిరుపయోగంగా మారింది. తాజా గా ఏంఎల్‌ఏ గండ్ర సత్యనారాయణరావు గెలుపు అనంతరం సీసీ రోడ్డును మంజూరు చేసి పూర్తి చేశారు. అయినప్పటికీ బస్టాండ్‌ను ప్రారంభించకపొడంపట్ల మండల ప్రజలు, ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రయాణికులు
మండలకేంద్రానికి విద్యార్థులు,ఉద్యోగులు, ప్రజలు నిత్యం అధిక సంఖ్యలో వచ్చి వెళ్తుంటారు.బస్టాండు లేక పోవడంతో షాపుల ముందు నిలుచుని బస్సుల కోసం గంటల తరబడి వేచిచూడల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. మూత్రశాలలు, మరుగు దొ డ్లు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నూతనంగా నిర్మించిన బస్టాండ్ ను ప్రారంభిస్తే సమస్యలు తీరుతాయి అనుకున్న ప్ర యాణికులకు నిరాశే మిగులుతుంది.ఇప్పటికైనా సంభందిత అధికారులు ,ప్రజ ప్రతిని ధులు, కాంగ్రెస్ నాయకులు స్పందించి బస్టాండ్‌ను ప్రారంభిచి ప్రయాణికుల కష్టా లు తీర్చాలని ప్రజలు కోరుతున్నారు.
ప్రభుత్వాలు మారినా తీరు మారలేదు
-సంవత్సరాల క్రితం నిర్మించిన చిట్యాల నూతన బస్టాండు నిర్మాణంవరకే పరిమితమైంది. ప్రభుత్వాలు మారిన బస్టాండ్ ను వినియోగంలోకి తీసుకురాకపోవడం దురదృష్టకరం. విద్యార్థులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.షాపుల ముందు ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటుంటే రాజకీయ నాయకులకు పరిస్థితి అర్థం కాకపోవడం సిగ్గుచేటు. కేవలం చౌరస్తా వరకే బస్సులను నడిపిస్తున్నారు. నూతనంగా నిర్మించిన బస్టాండ్ వరకు బస్సులను నడిపించి ప్రారంభిస్తే ప్రయాణికులకు మేలు చేకూరుతుంది. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు బస్టాండ్ ను ప్రారంభించాలని ఆశిస్తున్నాను.
-ప్రాంత హాస్టల్ కన్వీనర్, వేల్పుల రాజు కుమార్