మాజీ మంత్రి హరీశ్, కేటీఆర్‌పై మైనంపల్లి హన్మంతరావు ఫైర్
సిద్దిపేట, నవంబర్ 9 (విజయక్రాంతి): హరీశ్ రావు, కేటీఆర్ రాష్ట్ర ప్రజలను రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మైనంపల్లి హన్మంతరావు విమర్శించారు. శనివారం సిద్ద్దిపేటలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా స్థానిక మినీ స్టేడియంలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవంలో కాలుజారి కిందపడిన తన వీడియోను సోషల్ మీడియాలో బీఆర్ఎస్ ట్రోల్ చేయడాన్ని మైనంపల్లి తప్పుబట్టారు.
తాను ఒక మ్యాచ్‌లో డకౌట్ అయితే మరో మ్యాచ్‌లో సెంచరీ కొడతానని చెప్పారు. ఆటలో ఆడటం, పడటం కామన్ అని అన్నారు. సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు చేపడుతుంటే హరీశ్‌రావుకు కండ్లు మండుతు న్నాయని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా హరీశ్‌రావు, కేటీఆర్ చిల్లర రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ గౌడ్, యాదగిరి, ఇమామ్, వివప్ప, ఆనంద్, లక్ష్మి, కలీమొద్దీన్, మహేందర్, రాజ్ బహద్దూర్ రెడ్డి పాల్గొన్నారు.