09-04-2025 01:21:44 AM
తలకొండపల్లి,ఏప్రిల్ 08:ప్రభుత్వ భూమిలో చెట్లు నరికి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న విషయం ఫిర్యాదు రావడంతో సంబందిత అదికారులు తనిఖీలు నిర్వహించి కేసు నమోదు చేసిన సంఘటన చుక్కాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలలోకి వెలితే రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం చుక్కాపూర్ గ్రామ శివారులో కలికిదోన వేణుగోపాలస్వామి దేవాలయం ఉంది.ఈ దేవాలయానికి అప్పటి వనపర్తి రాజ వంశస్తులు వివిద ప్రాంతాలలో సుమారు 180 ఎకరాల భూ ములు ఇచ్చారు.
అదేవిదంగా చుక్కాపూర్ గ్రామంలో 110 ఎకరాలు దేవాలయం పేరిట దేవాదాయశాఖలో నమోదై ఉంది. దేవాలయంలో పుజారులుగా సిద్దాంతి పట్టాభిరామశర్మ, అతని కుటుంబ సభ్యులు వ్యవహరిస్తున్నారు.వారి ఆదీనంలొనే దేవాలయ భూములు ఉన్నాయి.ఐతే దేవాలయ భూ మి సర్వే నెంబరు 75 లో ఎపుగా పెరిగ చేట్లను ఇటీవల కొందరు నరికి వేస్తున్నట్లు గ్రామాస్తులు సంబందిత అదికారులకు ఫిర్యాదు చేశారు.మళ్లీ రెండు రోజులుగా చెట్లను నరకడం మొదలుపెట్టారు.విషయాన్ని గ్రామస్తులు రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెల్లారు.స్పందించిన రెవెన్యూ,అటవీ శాఖ అధికారులైన ఆర్‌ఐ మంజుల,ఆమనగల్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వెంకటేష్ గౌడ్,వనసంరక్షణ అదికారులతో కలిసి మంగళవారం సంఘటన స్తలాన్ని పరిశీలించి చెట్ల నరికివేత వివరాలను సేకరించారు.
ఇందులో 11వేప 1తుమ్మ చెట్లను నరికినట్లు గుర్తించి సంబందిత వ్యక్తులపై కేసు నమోదు చేసి అటవీ శాఖ డివిజనల్ అదికారులకు నివేదించినట్లు ఆమనగల్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వెంకటేష్ గౌడ్ వివరించారు. ఆలయ పుజారి వాల్టా చట్టాన్ని దిక్కరించి చెట్లను నరికి వేసి అమ్ముకోవడం ఎంతవరకు సమంజసమని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు.సమగ్ర విచారణ చేసి చెట్లు నరికిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు అదికారులను కోరుతున్నారు.