calender_icon.png 5 November, 2024 | 9:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంటి స్థలాల సమస్యను వెంటనే పరిష్కరించాలి

04-11-2024 04:40:12 PM

యాదాద్రి భువనగిరి (విజయక్రాంతి): బొమ్మలరామారం మండల పరిధిలో ఉన్న మర్యాల గ్రామంలో గతంలో ఇచ్చిన ఇంటి స్థలాల సమస్యను వెంటనే పరిష్కరించాలని ఈ రోజున సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గ్రీవెన్స్ డే సందర్భంగా వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా దాసరి పాండు మాట్లాడుతూ.. గత 10 సంవత్సరాల క్రితం గ్రామంలో ఇల్లు లేని పేదలందరికీ ఇళ్ల నిర్మాణం కోసం పట్టా సర్టిఫికెట్లు ఇచ్చారని కొంతమంది రైతుల వద్ద రోడ్డు కోసం పట్టా భూమిని తీసుకున్నారని అలాంటి రైతులకు ఇంటి స్థలం చూయించి మళ్ళీ ప్రభుత్వం ఇంటి స్థలం ఇచ్చి మళ్లీ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నదని స్థానిక అధికారులు కూడా ఇతర అవసరాల నిమిత్తం వాడుకోవడానికి రాజకీయ నాయకుల మాటలు విని అరులైన పేదలకు ఇచ్చిన ఇంటి స్థలాన్ని మళ్లీ తీసుకోవడానికి ప్రయత్నం చేయడం సమంజసం కాదని వారన్నారు. పేదలకు ఇచ్చిన హాల్లో పేదల నీళ్ల నిర్మాణం చేసుకోవడానికి ప్రభుత్వం రుణం కూడా ఇవ్వాలని లేదంటే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు. ఈ కార్యక్రమంలొ మండల కార్యదర్శి శ్రీ శైలం నాయకులు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.