calender_icon.png 26 December, 2024 | 3:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మతలబు వేరే ఉంది: ఎంపీ అరుణ

25-12-2024 01:31:21 AM

సినీ స్టార్ అల్లు అర్జున్‌ను సీఎం రేవంత్‌రెడ్డి వేధించడం వెనుక అసలు మతల బు వేరే ఉందని, అది త్వరలోనే తేలనున్నదని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ ఆరోపించారు. మంగళవారం ఆమె హైదరా బాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను పరామర్శించారు. బాలుడి ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి వైద్యులను ఆరా తీశారు.

బాలుడి కుటుంబసభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. తర్వాత ఎంపీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నదని, గతంలో ఎన్నడూ ఇలాంటి కక్షపూరిత రాజకీయ రాజకీయాలను తాను చూడలేదన్నారు. రాష్ట్రంలో అసలే సమస్య లేదన ట్లు సంధ్య థియేటర్ తొక్కిసలాట అంశా న్ని ఎంఐఎం సభ్యులతో అడిగించి మరీ చర్చ పెట్టారని మండిపడ్డారు.

సీఎం ఏం  చేసినా దానికి ఏదో ఒక కారణం ఉంటుందన్నారు. ఢిల్లీకి సూట్‌కేసులు పంపే విష యంలోనే సీఎంకు ఎక్కడో చెడిందని అనుమానం వ్యక్తం చేశారు. ఈ కారణంతోనే అల్లు అర్జున్‌ను సీఎం టార్గెట్ చేసి ఉంటారని అభిప్రాయపడ్డారు. ప్రజాసమస్యలను పక్కా దోవ పట్టించేందుకే సీఎం ఇలాంటి చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఇచ్చిన హామీలను ప్రజలు నెరవేర్చాలని కోరతారనే డ్రామాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు.