calender_icon.png 13 April, 2025 | 2:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్రమాలు ముమ్మాటికీ నిజం

13-04-2025 01:11:33 AM

  1. హెచ్‌సీయూ భూములను వేలం వేసిందా? తాకట్టు పెట్టిందా? అమ్మిందా? 
  2. ప్లాట్లుగా మార్చి ఎవరికైనా కేటాయించిందా? 
  3. ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందే 
  4. ఆర్‌బీఐ, సెబీ సంస్థలతో విచారణకు ఆదేశించాలి 
  5. మాజీ మంత్రి- కేటీఆర్

కరీంనగర్, ఏప్రిల్ 12 (విజయక్రాంతి): హెచ్‌సీయూ భూముల విషయంలో అక్రమాలు ముమ్మాటికీ నిజమేనని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నారు. కంచ గచ్చిబౌలి భూములను అమ్మి రూ.10 వేల కోట్ల అవినీతికి రాష్ట్ర పాల్పడుతోందని పునరుద్ఘాటించారు. తాము చెప్పినట్టుగానే హెచ్‌సీయూ భూములను తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చినట్లు పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ చెపుతుంటే.. ప్రభుత్వం అంగీకరించడంలేదన్నారు.

శనివారం కరీంనగర్‌లోని బీఆర్‌ఎస్ పా ర్టీ కార్యాలయంలో ఉమ్మడి జిల్లాలోని ఎ మ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో బీఆర్‌ఎస్ రజోత్సవ సభ నిర్వహణపై సమావేశం నిర్వహించారు. అనంతరం కేటీఆర్ మీడియా తో మాట్లాడుతూ.. హెచ్‌సీయూకి చెందిన 400 ఎకరా ల భూములను ప్రభుత్వం వేలం వేసిందా? తాకట్టు పెట్టిందా? అమ్మిందా? లేదా ప్లాట్లు గా మార్చి ఎవరికైనా కేటాయించిందా అన్న విషయాన్ని స్పష్టం చేయాలని కోరారు.

ఆ భూములపై రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తున్న పత్రాలు కూడా ఫేక్ అని ఆరోపించారు. ప్రభుత్వానికి ఆ భూములపై అధికారం లేదని, దానిని ఆక్రమించడానికి ప్రయత్నిస్తే చీఫ్ సెక్రటరీని జైలులో పెడతామని సుప్రీంకోర్టు హెచ్చరించింది నిజం కాదా? అని ప్రశ్నించారు. బీకాన్ అనే సంస్థకు భూములు కుదువపెట్టింది అవాస్తవమో కాదో ప్రభు త్వం బ యట పెట్టాలన్నారు. రూ.10వేల కోట్ల రుణానికి రూ.170 కోట్ల కమీషన్ ఎందుకిచ్చారని కేటీఆర్ ప్రభుత్వాన్ని నిలదీశారు.  

బీజేపీ ఎంపీతో సీఎం పాత దందాలు

ఓ బీజేపీ ఎంపీ ముంబై బ్రోకర్ సంస్థను తెస్తే ఆ ఎంపీకి సహాయం చేస్తా అని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారని కేటీఆర్ ఆరోపించారు. ఆ సహాయం జరిగిన వెంటనే బీజేపీ ఎంపీ పేరుతో పాటు ఆయనకు జరిగిన లాభాన్ని బయటపెడతానని, ఆ ఎంపీ తో సీఎంకు ఉన్న పాత దందాలు కూడా బ యటపెడతాని చెప్పారు. తాము అధికారం లో ఉన్నప్పుడు ప్రభుత్వ సంస్థలే భూముల ను విక్రయించాయని చెప్పారు. ప్రస్తుతం ఒ క బ్రోకర్ సంస్థను తీసుకొచ్చి దానికి భూ ములు తాకట్టు పెట్టారని ఆరోపించారు. 

మూసీలో లక్షన్నర కోట్ల అవినీతి 

మూసీ ప్రక్షళనలో ఏం జరుగుతుందో మంత్రి శ్రీధర్‌బాబుకు ముఖ్యమంత్రి చెప్పడం లేదని, అందులో లక్షన్నర కోట్ల రూ పాయల అవినీతి జరగబోతున్నదని కేటీఆర్ ఆరోపించారు. రైతు రుణమాఫీకి, పెన్షన్లకు, ఎన్నికల హామీల అమలుకు డబ్బులు లేకు న్నా లక్షన్నర కోట్ల రూపాయలతో మూసీకి నిధులు ఉన్నాయని చెపుతున్నారన్నారు. 

రేవంత్‌రెడ్డిని కాపాడుతున్న బండి సంజయ్  

15 నెలలుగా బీజేపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ రేవంత్‌రెడ్డిని అన్ని రకాలుగా కాపాడుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. రేవంత్‌రెడ్డి, బండి సంజయ్ తమకు అవసరమైన చోట చేతులు కలిపి చీకట్లో మా ట్లాడుకుంటున్నారని ఆరోపించారు. ఈ కారణంగానే రేవంత్‌రెడ్డి మీద ఎలాంటి వ్యాఖ్య లు కూడా బండి సంజయ్ చేయరన్నారు.

సంచులు మోసే పార్టీ, చెప్పులు మోసే పార్టీ వల్ల తెలంగాణకు ఏమాత్రం లాభం లేదని దుయ్యబట్టారు. తాము అధికారంలో ఉన్నప్పుడు కరీంనగర్ జిల్లాతో పాటు తెలంగాణ మొత్తం ప్రాజెక్టులు కళకళలాడాయని, ఇప్పుడు ఈ రెండు పార్టీలతో ఎడారి వాతావరణం కనిపిస్తోందన్నారు. ఉమ్మడి కరీంన గర్ జిల్లా రైతుల పక్షాన వెంటనే కాలేశ్వరానికి మరమ్మతులు చేసి నీటిని అందించాలని డిమాండ్ చేశారు.

లక్షలాది మందితో బీఆర్‌ఎస్ రజోత్సవం

ఈ నెల 27న వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తిలో లక్షలాది మందితో బీఆర్‌ఎస్ రజో త్సవ సభను నిర్వహిస్తామని కేటీఆర్ అన్నా రు. సంవత్సరంపాటు రజోత్సవ సంబరాలను నిర్వహిస్తామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏర్పడిన పార్టీ బీఆర్‌ఎస్ అని, రాష్ట్రాన్ని సాధించిన పార్టీ బీఆర్‌ఎస్ అని, ఇప్పటికీ తెలంగాణ పార్టీగా, మన ఇం టి పార్టీగా ప్రజలు గుర్తిస్తారని అన్నారు.

రజోత్సవ సభకు ఉమ్మడి జిల్లాల నుంచి లక్షలాది మంది కార్యకర్తలు, ప్రజలను తరలి స్తామని తెలిపారు. ఇప్పటికే ఆర్టీసీకి 10 కోట్ల రూపాయలు చెల్లించామని, వాహనాలు సమకూర్చుకుంటున్నామని, రజోత్సవ సభ ను ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. భా ష మీద, యాస మీద జరిగిన దాడిని తిప్పికొడుతూ సాంస్కృతిక పునరుజ్జీవనంపై పెద్ద పీట వేశామని చెప్పారు. మే నెలలో సభ్యత్వ నమోదు అనంతరం పార్టీ నిర్మాణం చేస్తామని తెలిపారు.

అనంతరం శిక్షణ కార్యక్ర మాలు నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే గంగుల, ఎమ్మెల్సీ ఎల్ రమణ, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యేలు వొడితెల సతీష్‌బాబు, సుంకె రవిశంకర్, పుట్ట మధు, రసమయి బాలకిషన్, కల్వకుంట్ల విద్యాసాగర్రావు, కోరుకంటి చందర్ తదితరులు పాల్గొన్నారు.