calender_icon.png 25 March, 2025 | 8:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

షురూ అయినా ఐపీఎల్ జాతర...

22-03-2025 07:49:57 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL-2025) 18వ సీజన్ ఆరంభోత్సవం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో అట్టహసంగా జరిగింది. బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్(Actor Shah Rukh Khan) తన అద్భుతమైన ప్రసంగంతో అలరించారు. గాయని శ్రేయ ఘోషల్(Shreya Ghoshal) తన మధురమైన స్వరంతో అభిమానులను ఉర్రూతలూగించింది. బాలీవుడ్ నటి దిశా పటానీ(Actress Disha Patani) తన అద్భుతమైన నృత్య కదలికలతో అందరినీ ఆకట్టుకుంది. పంజాబీ గాయకుడు కరణ్ ఆజ్లా(Singer Karan Ajla) అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు. నటుడు షారుఖ్ ఖాన్ కేకేఆర్ ప్లేయర్ రింకు సింగ్, విరాట్ కోహ్లీ(Virat Kohli)లను వేదికపైకి ఆహ్వనించి.. వారిద్దరితో కలిసి వేర్వేరు పాటలకు నృత్యం చేశారు. అనంతరం బెంగళూరు జట్టు కెప్టెన్ రజత్ పటిదార్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు. 

బెంగళూరు జట్టు:

విరాట్ కోహ్లి, ఫిలిప్ సాల్ట్(వికెట్ కీపర్), రజత్ పటీదార్(కెప్టెన్), లియామ్ లివింగ్టన్, జితేశ్ శర్మ, టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్య, రసిఖ్ సలామ్, సుయాశ్ శర్మ, జోష్ హేజిలవ్వుడ్, యశ్ దయాల్..

కోల్‌కాతా నైట్ రైడర్స్ జట్టు:

క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), వెంకటేశ్ అయ్యర్, అజింక్య రహానె (కెప్టెన్), రింకు సింగ్, అంగ్ క్రిష్ రఘువంశీ, సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్, రమణ్ప్ సింగ్, స్పెన్సర్ జాన్సన్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి..