17-12-2024 12:57:46 AM
* హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఈనెల 24వరకు వేచిచూస్తాం
* రాచకొండ సీపీ సుధీర్‌బాబు
ఎల్బీనగర్, డిసెంబర్ 16: సినీ నటుడు మోహన్‌బాబుపై నమోదైన కేసులపై విచారణ కొనసాగుతోందని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు తెలిపారు. ఎల్బీనగర్ క్యాంప్ ఆఫీసులో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేసులకు సం బంధించి ఇప్పటికే మోహన్‌బాబుకు నోటీసులు ఇచ్చామని తెలిపారు. అయితే హైకోర్టు మోహన్‌బాబును ఈనెల 24వ తేదీ వరకు విచారణకు పిలవొద్దని ఆదేశించిదని.. కోర్టు ఉత్తర్వులను గౌరవిస్తూ మోహన్‌బాబుపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.
అప్పటివరకు వేచిచూసి చూస్తామని ఆయన స్పందించకుంటే మరోసారి నోటీసు ఇస్తామని, అప్పటికి కూడా స్పందించకుంటే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అయితే ఆయన చేతిలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జర్నలిస్టును మోహన్‌బాబు పరామర్శించడంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. మోహన్‌బాబుకు రాచ కొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆయుధ లైసెన్స్ ఇవ్వలేదని, ఆయన వద్ద రెండు గన్లు ఉన్నట్లు గుర్తించామని, ఇప్పటికే మోహన్‌బాబు ఏపీలోని చంద్రగిరిలో గన్లను పోలీసులకు అప్పగించారని తెలిపారు.