calender_icon.png 20 April, 2025 | 3:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రైవేట్, కార్పొరేట్ జూనియర్ కాలేజీల ఆగడాలను అరికట్టాలి

20-04-2025 12:17:14 AM

ఆన్లైన్ ద్వారానే ఇంటర్ అడ్మిషన్లు నిర్వహించాలి..

వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలి: ఏబీవీపీ 

హైదరాబాద్ సిటీబ్యూరో (విజయక్రాంతి): ప్రైవేట్, కార్పొరేట్ జూనియర్ కాలేజీల ఆగడాలను అరికట్టాలని, ఆన్లైన్ ద్వారానే ఇంటర్ అడ్మిషన్లు నిర్వహించాలని ఏబీవీపీ నగర కార్యదర్శి పృథ్వీతేజ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం ఏబీవీపీ హైదరాబాద్ మహానగర శాఖ ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్యకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పృథ్వీతేజ మాట్లాడుతూ వెంటనే ఇంటర్ కాలేజీల అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరారు. - నిబంధనలకు విరుద్ధంగా రూ.లక్షలకు లక్షలు ఫీజులు వసూలు చేస్తున్న కళాశాలలపై చర్యలు తీసుకోవాలన్నారు. - బోర్డు నిబంధనలకు వ్యతిరేకంగా క్లాసులను నడుపుతున్న కాలేజీలను వెంటనే మూసివేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నగర సహాయ కార్యదర్శి నందిని ,ఆదిత్య ,భరత్ జిల్లా కన్వీనర్లు హరి ప్రసాద్,ఉదయ్ ,విక్రమ్ ,శివకృష్ణ పాల్గొన్నారు.