22-03-2025 12:26:36 AM
సూర్యాపేట, మార్చి 21: ప్రస్తుత కాలంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా చరవాణి వాడకం రోజుకు రోజు పెరిగి పోతుందని, అదేస్థాయిలో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయని, వాటి పట్ల ఎప్పటికప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ నరసింహ సూచించారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయం నందు నిర్వహిస్తున్న సోషల్ మీడియా మానిటరింగ్ సెల్ ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సామాజిక మాధ్యమాలైన వాట్సాప్, ఫేస్ బుక్, ఎక్స్ వంటి వాటిల్లో వచ్చే లింకులను ఇతరులకు పంపకూడదని, పిల్లలకు చరవాణిని ఇవ్వకూడదని, బెట్టింగ్ యాప్ ల జోలికి పోకూడదని, కులమతాలను రెచ్చగొట్టి మనోభావాలు కించపరిచే సమాచారం వ్యాప్తి చేయకూడదని అన్నారు. అంతర్జాలం ను జ్ఞానం పెంపొందించుకోడానికి వాడుకోవాలన్నారు.