హైదరాబాద్, ఖేల్ ప్రతినిధి: ఈఎమ్‌ఈ సెయిలింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అంతర్జాతీయ జడ్జీలకు హుస్సేన్‌సాగర్‌లో ప్రత్యేక సెమినార్ నిర్వహిం చారు. 15 ఏళ్ల తర్వాత న్యాయనిర్ణీతలకు మన దేశంలో సెమినార్ చేపట్టినట్లు నిర్వాహకులు వెల్లడించారు. మూడు రోజుల పాటు సాగిన ఈ సదస్సులో అంతర్జాతీయ స్థాయి పోటీల్లో న్యాయనిర్ణేతలుగా విధులు నిర్వహిస్తున్న పలువురు జడ్జీలు పాల్గొన్నట్లు లెఫ్టినెంట్ జనరల్ నీరజ్ వర్షే తెలిపారు. సరికొత్త నిబంధనలు, విధి విధానాలపై జడ్జీలకు ఈ సదస్సులో అవగాహన కల్పించిన ట్లు వివరించారు. వర్క్‌షాప్‌లు, కేస్ స్టడీలు, ప్రాక్టీస్‌ల ద్వారా ఫలితాల్లో మరింత కచ్చితత్వం రానుందని పేర్కొన్నారు.