05-07-2024 01:42:26 AM
సీఎస్‌ఓ సమ్మిట్‌లో విదేశాంగశాఖ మంత్రి
న్యూఢిల్లీ, జూలై 4: దేశాల సార్వభౌమత్వం, సమగ్రతను అందరూ గౌరవించి తీరాల్సిందేనని భారత్ ఉద్ఘాటించింది. షాంఘై సహకార సమాఖ్య (ఎస్‌సీవో) సమావేశంలో ఈ అంశంపై చర్చ జరగాలని డిమాం డ్ చేసింది. కజకిస్థాన్‌లోని ఆస్తానాలో జరుగుతున్న ఎస్‌సీవో సమ్మిట్‌లో ప్రధాని మోదీ తరఫున విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ ప్రసంగించారు. ‘మౌలిక సదుపాయా లు, కనెక్టివిటీ ప్రాజెక్టులకు దేశాల సార్వభౌమత్వం, సమగ్రతను గౌరవించటమే ముఖ్యమైనది. వాణిజ్య హక్కు ల్లో వివక్ష చూపకూడదు. ఈ అం శం పై ఎస్‌సీవో విస్తృతంగా చర్చించాల్సిన అవసరం ఉన్నది’ అని కుండబద్దలు కొట్టారు.