calender_icon.png 24 January, 2025 | 4:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్ఫూర్తిప్రదాత సుభాష్ చంద్రబోస్

24-01-2025 02:03:28 AM

నేతాజీ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ నివాళి

న్యూఢిల్లీ, జనవరి 23: నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకుని ప్రధాని నరేంద్రమోదీ గురువారం ఆయనకు నివాళులర్పించారు. నేతాజీ ఆదర్శాలు, భారత స్వాతంత్య్రంపట్ల ఆయన చూపిన అచెంచెల అంకితభావం ఎల్లప్పడూ మనకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. 

వికసిత్ భారత్ కోసం ప్రజలంతా ఐక్యంగా ఉండాలని ఈ సందర్భంగా ప్రధాని పిలుపునిచ్చారు. దేశాన్ని బలహీనపరిచేందుకు, ఐక్యతను విచ్ఛిన్నం చేసేం దుకు ప్రయత్నిస్తున్న శక్తులకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని సూచించారు. ఈ క్రమంలోనే పరాక్రమ దివస్ సందర్భంగా ఒడిశా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు.

ఈసారి నేతాజీ జయంతిని ఆయన పుట్టిన గడ్డపై జరుపుకోవడం ఆనందాన్నిచ్చిందన్నారు. అక్కడ నేతాజీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను సందర్శించారు. ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడంపట్ల ఒడిశా ప్రభుత్వానికి, ఆ రాష్ట్ర ప్రజలను ప్రధాని ప్రశంసించారు.