calender_icon.png 26 October, 2024 | 4:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

10వేల కోట్లకుపైగా వసూళ్లతో ది ఇన్‌సైడ్ ఔట్ 2

15-07-2024 02:12:48 AM

పేరు మోసిన హీరోలంటూ ఎవరు లేరు. సాహసోపేతమైన పోరాట సన్నివేశాలూ లేవు. అందాలతో అలరించే సుందరాంగిణులసలే లేరు. ఒక్కమాటలో చెప్పాలంటే ‘కమర్షియల్’ సినిమా పేరిట చలామణీలో ఉన్న కొలమానాలేవీ లేకుండానే కోటానుకోట్ల కలెక్షన్లు రాబడుతోంది ఓ చిత్రం. అదే పిక్సర్ యానిమేషన్ స్టూడియోస్ నిర్మాణంలో రూపొందిన ‘ది ఇన్‌సైడ్ ఔట్ 2’.

పీట్ డాక్టర్ దర్శకుడిగా వచ్చిన ‘ఇన్‌సైడ్ ఔట్’ (2015) చిత్రానికి సీక్వెల్‌గా కెల్సే మ్యాన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా జూన్ రెండవ వారంలో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. సుమారు రెండు వందల కోట్ల నిర్మాణ వ్యయంతో రూపొందిన ఈ సినిమా నెల రోజుల వ్యవధిలో పదివేల కోట్ల రూపాయాలకు పైగా వసూలు చేసి, బాక్సాఫీస్ వద్ద విజయవిహారం చేస్తోంది. 1.36 గం.ల నిడివితో ప్రదర్శితమవుతున్న ఈ చిత్రంలో భావోద్వేగాలదే ప్రధాన పాత్ర. తొలి భాగంలో పిన్న వయస్కురాలైన రిలే ఆండర్సన్, ఎదిగే క్రమంలో తనలోని ఆనందం, కోపం, భయం, బాధ వంటి భావోద్వేగాలను ఎలా ఎదుర్కొంది వంటి విషయాలను చర్చించగా, రెండవ భాగంలో మొదటి భాగంలోని భావోద్వేగాలకు తోడు యుక్త వయస్కురాలిగా ఆమెకు గల ఆరాటాన్ని, దాని పర్యావసానాల్ని తెరపై ఆవిష్క రించారు దర్శకుడు. సమకాలీన అంశాలను ఉద్వేగ భరితంగా తెరకెక్కించి.. ప్రేక్షకులను థియేటర్లలో కూర్చోపెట్టేది ‘మోషన్ పిక్చర్‌లోని ఎమోషన్స్ మాత్రమే’ అని మరోసారి రుజువు చేసిం దీ చిత్రం. ఈ రకమైన చిత్రాలకి పెట్టింది పేరైప పిక్సర్ యానిమేషన్ స్టూడియోస్ సంస్థలో తొలి చిత్రమైన ‘టాయ్ స్టోరీ’ (1995) నుంచి ‘ఇన్‌సైడ్ ఔట్ 2’ వరకు ‘ఫైండింగ్ డోరి’ (2016), ‘ఇన్‌క్రెడిబుల్స్ 2’ (2018) వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలు తెరకెక్కాయి. ప్రేక్షకాదర ణతో పాటు ప్రతిష్ఠాత్మక ఆస్కార్ పురస్కారాలను సైతం గెలుచుకున్నాయి. 2024లో బ్రహ్మాండమైన విజయం సాధించిన ‘ఇన్‌సైడ్ ఔట్ 2’ చిత్రం, విజయవంతమైన యానిమేషన్ చిత్రాల్లో నాల్గవ స్థానంలో నిలిచింది.