మావోయిస్టుల మరో ఘాతుకం
భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 26 (విజయక్రాంతి): సీపీఐ ఎంఎల్ మావోయిస్టులు సోమవారం మరో ఘా తుకానికి పాల్పడ్డారు. పోలీస్ ఇన్‌ఫార్మర్ అనే అనుమానంతో జూ గూర్ గ్రామానికి చెందిన సీతూ మ ండావిని దారుణంగా కొట్టి చంపా రు. తెలంగాణ సరిహద్దు రాష్ట్రమైన చత్తీస్‌ఘడ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా భైరాంఘడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘాతుకం చోటు చేసుకొంది. తమ సమాచారాన్ని పోలీసులకు చే రవేస్తున్నాడని ఆరోపిస్తూ ప్రజాకోర్టు నిర్వహించిన మావోయిస్టులు సీతూ మండావిని హతమార్చామని ఘటనా స్థలంలో లేఖ వదిలి వె ళ్లారు. కాగా ఈనెల 21న కూడా పో లీస్ ఇన్‌ఫార్మర్ అంటూ మహిళా మావోయి స్టు బండి రాధ.. అలియాస్ నీల్సో ను మావోయిస్టులు కొట్టి చంపి రోడ్డు పై పడేసిన సంఘటన మరువక ముందే మరొకరిని చంపేయ డం తో ఆందోళన మొదలైంది.