calender_icon.png 5 February, 2025 | 10:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శిశు మరణాల రేటు తగ్గించాలి

05-02-2025 01:42:21 AM

* జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్

జగిత్యాల అర్బన్, ఫిబ్రవరి 4: జిల్లాలో శిశు మరణాల రేటును తగ్గించేందుకు వైద్యాధికారులు, వైద్యులు కషి చేయాలని జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ అన్నారు. మంగళవారం  కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హల్లో చైల్డ్ డెత్ రివ్యూపై సమీక్ష నిర్వహిం చారు. ఈ సమావేశంలో ఇప్పటి వరకు జరిగిన 78 మరణాలలో 14 మంది  చిన్న పిల్లల మరణాలపై ఆడిట్ నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ సత్య ప్రసాద్ మాట్లాడుతూ చిన్న పిల్లల మరణాలు సంభ వించకుండా మార్గాలను అన్వేషించాలని వైద్యాధికారులకు సూచించారు. రవాణా సౌకర్యము మెరుగుపరచాలని, వైద్యాధి కారులు అందుబాటులో ఉండాలని, స్కా నింగ్ సెంటర్లలో టిప్పా స్కానింగ్, 2 డి ఎకో అందుబాటులో ఉంచాలని సూచించారు. జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు సమీక్ష సమావేశంలో పాల్గొని మరణాల నివేదికలను సమర్పిం చారు.

ప్రతి కేసును క్షుణ్ణంగా విచారించి పలు సూచనలు చేశారు. ఎక్కువగా ప్రీ టర్మ్ బేబీస్, కన్జెంటల్ హార్ట్ డిసీజెస్, ఆస్పిరేషన్ కేసులున్నాయన్నారు. ముఖ్యంగా నివారించ తగిన మరణాలపై పలు సూచనలు చేశారు. తల్లులు తమ పిల్లలకు పాలు పట్టే విధానం, స్నానం చేయించడంలో తీసుకునే జాగ్రత్తలు తదితర అంశాలపై అవగాహన కల్పించా లన్నారు.

ప్రతి మహిళా ఆరోగ్య కార్యకర్త, ఆశ కార్యకర్త  గహ సందర్శన సమయంలో డెలి వరీ అయిన బాలింతలకు కచ్చితంగా కౌన్సి లింగ్ ఇవ్వాలని ఆదేశించారు. ఈ సమావే శంలో చైల్డ్ డెత్ రివ్యూ కమిటీ మెంబర్స్, ప్రోగ్రాం ఆఫీసర్ చైల్డ్ హెల్త్  ఇమ్యునైజేషన్ డాక్టర్ ఏ శ్రీనివాస్, మాతా శిశు సంరక్షణ అధికారి డాక్టర్ జైపాల్ రెడ్డి, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూపరిండెంట్ డాక్టర్ సుమన్ మోహన్ రావు, జిల్లా సంక్షేమ అధి కారి నరేష్, పిల్లల వైద్య నిపుణులు  పాల్గొన్నారు.