18-04-2025 12:00:00 AM
అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ పై చర్యలేవి?
భద్రాద్రి కొత్తగూడెం ఏప్రిల్ 17 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జిల్లాస్థాయి అధికారులు వ్యవహరిస్తున్న ఉదాసీన వైఖరి అక్రమార్కులకు వరంగా మారింది. అందుకు పర్ఫెక్ట్ అవుట్ సోర్సింగ్ అండ్ మేనేజ్మెంట్ సర్వీసెస్ తీరుపై జిల్లా స్థాయి అధికారుల తీరు అద్దం పడుతోంది.
ఔట్సోర్సింగ్ ఏజెన్సీస్ అక్రమాలపై నిష్పక్షపాతంగా విచారణ నిర్వహించి నివేదికలు సమర్పించిన జిల్లా స్థాయి అధికారి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఉదాసీన వైఖరిని తేటతెల్లం చేస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మైనారిటీ గురుకుల కళాశాలలో 2023లో టీచింగ్,నాన్ టీచింగ్ ఉద్యోగాలను ఫర్ఫెక్ట్ అవుట్ సోర్సింగ్ అండ్ మేనేజ్మెంట్ సర్వీసెస్ ద్వారా భర్తీ చేయాలి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు.
అదే అదునుగా ఆ ఔట్సోర్సింగ్ ఏజెన్సీ ఉద్యోగం ఇప్పిస్తామని ఒక్కొక్కరికి రూ 16వేలు జీతం ఇస్తామని, ఒక్కొక్కరి నుంచి రూ 2 నుంచి రూ3 లక్షలు వసూలు చేశారని అప్పట్లోనే వచ్చిన ఆరోపణలపై 2023 మార్చి1, మైనారిటీ సెక్రటరీ నుంచి కలెక్టర్ కు అక్రమాలకు పాల్పడిన ఔట్సోర్సింగ్ ఏజెన్సీని బ్లాక్లిస్టులో పెట్టి, క్రిమినల్ చర్యలు తీసుకోమని అప్పటి జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు.
ఈ విషయా న్ని అప్పట్లో ఓ ప్రముఖ దినపత్రిక వెలు గు లోకి తేవడంతో, ఔట్సోర్సింగ్ ఏజెన్సీ అక్రమాలపై ఆనాటి కో-ఆపరేటివ్ అధికారి వెంక టేశ్వరరావును విచారణ అధికారిగా కలెక్టర్ నియమించారు. ఆయన పూర్తిస్థాయిలో విచారణ నిర్వహించి కలెక్టర్ కు నివేదిక సమర్పించారు.
నివేదికలో అక్రమాలు వెల్లాడై, ఔట్సోర్సింగ్ ఏజెన్సీ నుంచి లంచం రూ పంలో తీసుకున్న డబ్బులు వసూలు చేసి బాధితులకు చెల్లించాలని అప్పటి బూర్గంపాడు ఎమ్మార్వో కు కలెక్టర్ ఆదేశించారు. మైనార్టీ సెక్రటరీ ఆదేశాలు, కలెక్టర్ ఆదేశాలను క్షేత్రస్థాయి అధికారులు ఆమలు చేయలేదు.
పేరుకు ఆ ఏజెన్సీ ని బ్లాక్ లిస్టులో ఉంచామని చూపుతున్న, సదరు ఆ ఏజెన్సీస్ ఆరోగ్యశ్రీ విభా గంలో 33 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు చెల్లిస్తూ కొనసాగటం ఆశ్చర్యకరంగా ఉంది. సదరు ఆ ఏజెన్సీ సిబ్బందికి వేతనాలు సక్రమంగా ఇవ్వకపోగా, ఈపీఎఫ్ డబ్బులను చెల్లించడం లేదని, ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించలేదని స్పష్టం అవుతుంది.
దీంతో వారు ప్రభుత్వం నుం చి వచ్చే సౌకర్యాలను పొందలేక పోతున్నారు.ఆనాడే అధికారులు అ క్రమాలకు పాల్పపడిన ఔట్సోర్సింగ్ ఏజెన్సీ పై చట్టపరమైన చర్యలు తీసుకుంటే ప్రస్తుతం ఆరోగ్యశ్రీ విభాగంలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ సిబ్బంది మోసపోయి ఉండేవారు కాదు కదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.
ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ అక్రమాలకు పాల్పడిన ఔట్సోర్సింగ్ ఏజెన్సీ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సిబ్బం ది డిమాండ్ చేస్తున్నారు.