calender_icon.png 8 January, 2025 | 9:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీలంకకు బయల్దేరి వెళ్లిన భారత జట్టు

07-01-2025 11:55:43 PM

వికలాంగుల చాంపియన్స్ ట్రోఫీ..

న్యూఢిల్లీ: శ్రీలంక వేదికగా జరగనున్న వికలాంగుల చాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు భారత జట్టు మంగళవారం బయల్దేరి వెళ్లింది. 17 మందితో కూడిన భారత జట్టు జైపూర్ వేదికగా నిర్వహించిన క్యాంప్‌ను ముగించుకొని భారత్ ప్రధాన కోచ్ రోహిత్ జలానీ నేతృత్వంలో లంకకు వెళ్లింది. జనవరి 12 నుంచి టోర్నమెంట్ మొదలుకానుంది. ముంబైకి చెందిన విక్రాంత్ రవీంద్ర ఖేనీ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా.. మధ్యప్రదేశ్‌కు చెందిన యోగేందర్ సింగ్, ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన దేవేంద్ర సింగ్‌లు వికెట్ కీపర్లుగా వ్యవహరించనున్నారు. టోర్నీలో భారత్ ఇంగ్లండ్, శ్రీలంక, పాకిస్థాన్‌లతో మ్యాచ్‌లు ఆడనుంది. జట్టుకు సెండాఫ్ ఇచ్చేందుకు వచ్చిన డిసేబుల్డ్ క్రికెట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జనరల్ సెక్రటరీ రవికాంత్ చౌహాన్ మాట్లాడుతూ.. ‘ఈ అవకాశం కల్పించిన ఎన్‌జీవో స్వయమ్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ టోర్నీ నిర్వహణకు సహకరించిన డీసీసీఐకి కూడా ధన్యవాదాలు’ అని తెలిపారు. కార్యక్రమంలో డీడీసీఏ అధ్యక్షుడు రోహన్ జైట్లీ కూడా పాల్గొన్నారు.