10-04-2025 12:00:00 AM
కుమ్రం భీం ఆసిఫాబాద్,ఏప్రిల్ 9 ( విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించాలని కోరు తూ ఖాళీ గ్యాస్ సిలిండర్లతో బుధవారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోట శ్రీనివాస్ మా ట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం గ్యాస్, చమురు ధరలు పెంచి సామాన్య ప్రజలపై పెనుభా రం మోపిందన్నారు.
ఒకవైపు అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గుతుంటే కూడా మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం దారుణమని అన్నారు. కేంద్రం లోని మోడీ ప్రభుత్వ నాటకాలను ప్రజలు గమనించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు గోడిసెల కార్తీక్, కోరెంగా మాలశ్రీ, గేడo టికానంద్, నాయకులు శ్రావణి తదితరులు పాల్గొన్నారు.