10-04-2025 02:11:13 AM
చిలుకూరు, ఏప్రిల్,9: గ్యాస్ పెట్రోల్ డీజిల్ పై పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని సిపిఐ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు సిపిఐ, మరియు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో బుధవారం చిలుకూరు మండల కేంద్రంలో బస్టాండ్ సెంటర్లో గల కోదాడ, జడ్చర్ల,జాతీయ రహదారిపై ఖాళీ గ్యాస్ సిలిండర్లతో నిరసన వ్యక్తం చేస్తూ రాస్తా రోకో నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం పేద మధ్యతరగతి వర్గాల ప్రజలను ఆర్థికపరమైన ఇబ్బందులకు గురి చేస్తుందని, నరేంద్ర మోడీ ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ పై పెంచిన 50, రూపాయల ,డీజిల్, పెట్రోల్ ధరలను వెంటనే తగ్గించాలని, కేంద్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు పేద ప్రజలకు సంబంధించిన అన్ని రకాల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి ఆ వర్గాల ప్రజల ఓట్లను సానుభూతితో పొంది నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యవసర వస్తువుల ధరలను పెంచడం అనేది సిగ్గుచేటని,మోడీ ప్రభుత్వ చర్యల వల్ల మరల పాతకాలం రోజులు పేద ప్రజలు ఏ విధంగానైతే కట్టెల పొయ్యిలను వాడుతూ అనారోగ్యం పాలయ్యారు.
నేడు సాంకేతిక పరిజ్ఞానం ఎంత పెరిగిన కానీ మళ్ళీ అదే పాతకాలం నాటి విధానాలకు అలవాటు పడేలా ఈ పాలకవర్గాలు చేస్తున్నట్టు వంటి చర్యలకు నిదర్శనం అన్నారు . పెంచినటువంటి గ్యాస్, పెట్రోల్, డీజిల్, ధరలను తగ్గించకపోతే దేశవ్యాప్తంగా సామాన్య ప్రజలను సమీకరించి కేంద్ర ప్రభుత్వంపై సమరశీల పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ సీనియర్ నాయకులు దొడ్డ నారాయణరావు, సిపిఐ మండల కార్యదర్శి మండవ వెంకటేశ్వర్లు,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రెమిడీల రాజు, ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చేపూరి కొండలు, చిలువేరు ఆంజనేయులు,ముక్కా లక్ష్మీనారాయణ,దొడ్డ నాగేశ్వరరావు,
వడ్డేపల్లి కోటేష్, మల్లెపంగు సూరిబాబు , పొరల మట్టయ్య, మహిళా సమైక్య నాయకురాలు రెవిడాల జయసుధ, సాతులూరి అలివేలు, దొడ్డ నాగేశ్వరరావు, షేక్ మహీముదా బేగం,కస్తూరి సైదులు, జిల్లా శ్రీను, మాదాసు చిన్న ముత్యాలు, మాదారపు చిన్న వెంకటి,కస్తూరి వెంకటి,మాచర్ల వెంకటి, కట్టెకోల చంద్రయ్య, లక్ష్మయ్య, తదితరులు పాల్గొన్నారు.