15-04-2025 05:28:27 PM
సిపిఐ నేత అజయ్ సారథి డిమాండ్..
మహబూబాబాద్ (విజయక్రాంతి): పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని, వక్ఫ్ సవరణ చట్టం రద్దు చేయాలని, ఇందిరమ్మ ఇండ్లు, రాజు యువ వికాసం పథకాలను అర్హులకు అందించాలని మహబూబాబాద్ జిల్లా సిపిఐ నాయకుడు అజయ్ సారధి రెడ్డి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. సిపిఐ, ఏఐటీయూసీ సంయుక్త సమావేశం జిల్లా కేంద్రంలోని సిపిఐ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా అజయ్ సారథి రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పూర్తిగా పేదల సంక్షేమాన్ని విస్మరించి, కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేస్తుందని ఆరోపించారు.
గత బిఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి పూర్తిస్థాయిలో అమలు చేయకుండా చేతులెత్తేసిందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అలా కాకుండా అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. నిరంతరం ప్రజల కోసం కష్టపడేది ఎర్రజెండా పార్టీలేనని ఆయన పేర్కొన్నారు. మే డే వేడుకను ఘనంగా నిర్వహించాలని, ప్రతి ఒక్క కార్మికుడు ఎరుపు రంగు దుస్తులు ధరించి మేడే వేడుకల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు వెలుగు శ్రావణ్, పెరుగు కుమార్, రేషనపల్లి నవీన్, చింతకుంట్ల వెంకన్న, మామిండ్ల సాంబలక్ష్మి, శ్రావణ్, అశోక్, ఎండి మహమూద్, చిరంజీవి, ప్రవీణ్, చిదురాల జ్ఞానేశ్వర్, యాకమ్మ, పద్మ తదితరులు పాల్గొన్నారు.