01-04-2025 12:00:00 AM
భూటాన్, మాల్దీవ్స్ లాంటి సార్క్ దేశాలతో పోల్చితే భారత ప్రభుత్వం విద్యకు కేటాయిస్తున్న బడ్జెట్ చాలా తక్కువగా ఉంటున్నద ని ఇటీవల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అధ్యయన నివేదిక స్పష్టంచేసింది. దీనికి తోడుగా గత విద్యా సం వత్సరాలతో పోల్చితే 2023 24లో ఐఐటీలో బిటెక్ చేసిన విద్యార్థినీ విద్యార్థుల ప్రాంగణ నియా మకాలు 10 శాతం వరకు తగ్గాయనే ఆశ్చర్యకరమైన విషయాన్ని కూడా వెల్లడించింది. 2021- భూటాన్‌లో విద్యకు 7.47 శాతం నిధులు, మాల్దీవుల్లో 4.67 శాతం కేటాయించగా, భారత ప్రభుత్వ విద్యారంగం కేటాయింపులు 4.12 శాతం మాత్ర మే ఉండడం గమనార్హం. ‘నూతన విద్యా విధానం అమలు సజావుగా, సత్ఫలితాల దిశగా పయనించడానికి కేటాయింపులు పెంచా ల్సిన అవసరం ఉందని కూడాపై కమిటీ సిఫార్సు చేయడం సముచితంగా ఉంది.
ఐఐఎం ప్రాంగణ నియామకాల్లో మెరుగైన ఫలితాలు సాధించినప్పటి కీ ప్రతిష్టాత్మక ఐఐటీ, ఐఐఐటీ సంస్థ ల్లో 2021 పోల్చితే 2023 ప్రాంగణ నియామకాలు 10 శాతం వర కు తగ్గాయని కమిటీ అధ్యయనంలో తేలింది. దేశవ్యాప్త 23 ఐఐటీల్లో ఐఐటి- వారణాసి మిన హా (2021 83. 15 శాతం నుంచి 2023 88.04 శాతానికి పెరిగాయి) మిగిలిన 22 ఐఐటీ ల్లో బిటెక్ పూర్తి చేసిన యువత క్యాం పస్ ప్లేస్‌మెంట్లు తగ్గడం కొంత కలవరానికి కారణం అవుతున్నది. ఐఐ టీ -మద్రాస్‌లో 2021- 85.71 శాతం నుంచి 2023- 73. 29 శాతానికి తగ్గడా న్ని నిపుణులు గమనించారు. అదే విధంగా ఐఐటీ బాంబేలో 96.11 శాతం నుంచి 83.39 శాతానికి, ఐఐటీ కాన్పూర్‌లో 93.63 శాతం నుంచి 82.48 శాతానికి, ఐఐటీ ఢిల్లీలో 87.69 శాతం నుంచి 72.81 శాతానికి, ఐఐటీ గౌహతిలో 89.77 శాతం నుంచి 79.10 శాతానికి, ఐఐటీ రూర్కీలో 98.54 శాతం నుంచి 79.66 శాతానికి, ఐఐ టీ - హైదరాబాద్‌లో 86.52 శాతం నుంచి 69.33 శాతానికి, ఐఐటీ ధార్వాడ్‌లో 90.20 శాతం నుంచి 65. 56 శాతానికి, ఐఐటీ జమ్మూలో 92.08 శాతం నుంచి 70.25 శాతానికి ప్రాంగణ నియామకాలు తగ్గిన ట్టు చెబుతున్నారు.
అసలు కారణాలు
ఐఐటీ, ఐఐఐటీ, ఎన్‌ఐటీల్లో ప్రాంగణ నియామకాలు తగ్గడానికి యువత ఉన్నత విద్యకు మెగ్గు చూప డం, ఔత్సాహిక వ్యాపారవేత్తలుగా మారడం, జాబ్ మార్కెట్‌లో వచ్చిన మార్పులు, ఆధునిక నాణ్యమైన బోధనల్లో కొంత అలసత్వం లాంటి వి ముఖ్య కారణాలుగా నిపుణులు చెబుతున్నారు. అదే విధంగా ఎమ్‌ఎన్సీలు ప్రాంగణ నియామకాల్లో అం దించే వార్షిక వేతనాలు లేదా ప్యాకేజీల్లో కోతలు కూడా గమనార్హంగా ఉన్నాయి. ఆధునిక శాస్త్ర సాంకేతిక విద్యా బోధనల్లో సకారాత్మక మార్పులు రావాలని, అధ్యాపకులకు దశల వారీగా ఆధునిక టెక్నా లజీ రంగాల్లో శిక్షణలు ఇవ్వాలని, క్యాంపస్- పరిశ్రమల మధ్య అంతరాలను చెరిపి వేయాలని కూడా స్టాండింగ్ కమిటీ సిఫార్సు చేయడం సముచితంగా ఉంది. ఎన్‌ఐటీల్లో వార్షిక వేతనాల ప్యాకేజీల సగటు కనిష్ఠంగా 5 లక్షల నుంచి అత్యధికం గా 15 లక్షల వరకు మాత్రమే అం దించడం కూడా విచారకరం.
ప్రభుత్వాల మధ్య విభేదాలు
తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన విద్యా విధానం-2020 అమలుకు సిద్ధంగా లేకపోవటంతో సర్వశిక్ష అభియాన్, పీఎంశ్రీ పథకాలకు దూరంగా ఉన్నాయనే కారణాలతో ఆయా రాష్ట్రాలకు విద్యా నిధుల విడుదలను ఆపి వేయ డం మంచి పరిణామం కాదని కూడా కమిటీ అభిప్రాయపడింది. తమిళనాడుకు చెందిన దాదాపు 1,000 కోట్లు, కేరళకు చెందిన 1,000 కోట్లు, పశ్చిమ బెంగాల్‌కు చెందిన 860 కోట్ల నిధులు కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడం లేదని కూడా తేలింది. దేశం గర్వించదగిన అంతర్జాతీయ స్థాయి ఐఐటీల్లో సహితం ప్రాంగణ నియామకాలు తగ్గడం అనే అంశాన్ని తేలికగా తీసుకోకూడదు. సత్వరమే యువతలో అత్యాధునిక నైపుణ్యాల శిక్షణలను అమలు చేయడం మాత్రమే ఏకైక మార్గమని ఈ సందర్భంగా పై కమి టీ అభిప్రాయ పడింది.
ఈ మేరకు ఐఐటీలకు కొన్ని సూచనలూ చేసింది. రానున్న రోజుల్లో ఐఐటీల్లో దాదాపు 100 శాతం వరకు ప్రాంగణ నియామకాలు సుసాధ్యం కావాలని, ఆ దిశగా కేంద్ర ప్రభుత్వంతోపాటు ఐఐటీ యాజమాన్యాలు కూడా వడివడిగా అడుగులు వేయాలని కోరుకుందాం.
-డా. బుర్ర మధుసూదన్‌రెడ్డి