calender_icon.png 3 April, 2025 | 2:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆకట్టుకుంటున్న ‘హిట్3: ది థర్డ్ కేస్’ కౌంట్‌డౌన్ పోస్టర్

01-04-2025 10:18:48 PM

నేచురల్ స్టార్ నాని హైలీ యాంటిసిపేటెడ్ క్రైమ్ థ్రిల్లర్ ‘హిట్3: ది థర్డ్ కేస్’. హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో ‘హిట్’ సిరీస్‌లో మూడో భాగంగా రాబోతున్న ఈ చిత్రం ఇప్పటికే గ్లింప్స్, టీజర్, ఫస్ట్ సింగిల్‌కు అద్భుతమైన స్పందన రావడంతో సినిమాపై భారీ అంచనాలను నెలకొల్పాయి. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి తిపిర్నేని, నాని యునానిమస్ ప్రొడక్షన్స్ ప్రొడక్షన్స్‌తో కలిసి నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్న ఈ సినిమా వచ్చే మే 1న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ 30 డేస్ కౌంట్ డౌన్ పోస్టర్ రిలీజ్ చేశారు. నాని ఇంటెన్స్ లుక్‌లో సిగరెట్ కాలుస్తూ గన్ గురి పెట్టిన ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తోంది. సాను జాన్ వర్గీస్ సినిమాటోగ్రఫర్‌గా పనిచేస్తుండగా, మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. కార్తీక శ్రీనివాస్ ఆర్ ఎడిటింగ్‌గా, శ్రీనాగేంద్ర తంగాల ప్రొడక్షన్ డిజైన్‌గా పనిచేశారు.