calender_icon.png 11 January, 2025 | 1:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విజిబుల్ పోలీసింగ్‌కు ప్రాముఖ్యత

11-01-2025 12:53:08 AM

  • ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చొరవ
  • అక్రమ కార్యకలాపాలపై ఉక్కుపాదం
  • జిల్లాలో నేరాల నియంత్రణపై సీపీ దృష్టి

  • కరీంనగర్, జనవరి 10 (విజయక్రాంతి): జిల్లాలో నేరాల నియంత్రణపై పోలీస్ కమి షనర్ అభిషేక్ మొహంతి దృష్టి సారించారు. ముఖ్యంగా జిల్లాలో విజిబుల్ పోలిసింగ్ కు ప్రాముఖ్యత ఇవ్వనున్నారు. అలాగే జిల్లాలో అక్రమ కార్యకలాపాల నియంత్రణకు ఉక్కు పాదం మోవనున్నారు. రౌడీషీటర్లు, వీధి రౌడీలుగా చలామణి అయ్యే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వారి కదలికలను ఎప్ప టికప్పుడు గమనించనున్నారు.

  • కరీంనగర్ పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టనున్నారు. సైబర్ నేరాలు, యాంటీ డ్రగ్ అవగాహన, నివారణకు ప్రత్యే క చర్యలు తీసుకోనున్నాడు. ప్రజలతో మం చి సత్సంబంధాలను కలిగి ఉండి, బాధితు లకు వెంటనే ప్రతిస్పందించే ఖచ్చితమైన పోలీస్ సేవలు ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.

  • కరీంనగర్ కమిషనరేట్ కేంద్రంలోని అస్త్ర కన్వెన్షన్లో కమిషనరేట్లోని అన్ని విభాగాల అధికారులు, పోలీస్ స్టేషన్ల ఎస్ హెచ్పీలతో కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మొ హంతి ఇటీవల నేర సమీక్షా సమావేశం నిర్వ హించి దిశానిర్దేశనం చేశారు. ఆయా ప్రాం తాల్లో శాంతిభద్రతల సమస్యలు ఉన్నట్ల యితే వాటిని అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.

  • కమిషనరేట్ వ్యాప్తంగా నైట్ పెట్రోలింగ్ విధులను మరింత పటి ష్టంగా మెరుగు పరిచి నైట్ పెట్రోలింగ్లో భాగంగా నైట్ డ్యూటీ ఆఫీసర్ నైట్ రౌండ్ ఆఫీసర్, నైట్ పెట్రోలింగ్ ఆఫీసర్, నైట్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులను నియినుంచి పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. డయల్ 100 ద్వారా వచ్చే ప్రతి ఫిర్యాదులను వాస్తవంగా క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్య పరిష్కా రానికి కృషి చేస్తున్నారు.

  • పోలీస్ స్టేషన్ల పరిధిలోని ఫిర్యాదులు ఎక్కువగా అందే ప్రాంతాలపై దృష్టి పెట్టి రౌడీషీటర్లు, హిస్టర్ పీటర్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వారి కదలికలను ఎప్పటికప్పుడు గమనించను న్నారు. సమాజంలో పదే పదే శాంతిభద్ర తలకు విఘాతం కలిగించే వారితోపాటు ప్ర జలను మోసం చేసేవారిపై ఖచ్చితంగా షీట్ల ను తెరిచేందుకు రంగం సిద్ధం చేశారు.

  • ఇటీ వల అక్రమ గంజాయి రవాణా, వాడకం పెరిగిపోతున్నందున దానిని అరికట్టేందుకు ఇప్పటికే ప్రత్యేకంగా కమిషనరేట్ స్థాయిలో నార్కోటిక్ కంట్రోల్ సెటఏర్పాటు చేశారు. దాని సహాయంతో క్షేత్రస్థాయిలో దృష్టి కన బరిచి ఎన్డీపీఎన్ యాక్ట్ ద్వారా కేసులు న మోదు చేయనున్నారు. గంజాయి నట్టుబ డిన సమయంలో వారిపై నమోదు చేసిన కేసు వీగిపోకుండా, నిందితుడికి శిక్ష వడేలా టీజీనాబ్ జారీ చేసిన నియమాలను పాటిం చనున్నారు.

  • సైబర్ నేరాలు కూడా పెరిగి పోతున్నందున వాటి నియంత్రణకు పోలీస్ స్టేషన్ల వారీగా సైబర్ వారియర్లను నియ మించారు. సంబంధిత పోలీస్ స్టేషన్లో సైబర్ నేరం జరిగింది తెలిసిన వెంటనే వారు స్పందించి, బాధితులకు సహకరించి 1930కి, ఎన్సీఆర్ బి పోర్టలకు సమాచారం అందించి, పోగొట్టుకున్న సొత్తును తిరిగి ఇప్పించేలా చర్యలు తీసుకుంటున్నారు.

  • నేరం జరిగిన మొదటి గంట గోల్డెన్ అవర్ సమయంలో ఫిర్యాదు చేస్తే సొత్తును పొండే అవకాశం ఉంటుందని ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. కమిషనర్ స్థాయి లో సైబర్ నేరాలను అరికట్టేందుకు సైబర్ క్రైమ్ కంట్రోల్ సెల్ ఏర్పాటు చేశారు.

  • ఈ కార్యాలయంలో ఎప్పటికప్పుడు కమిషన రేట్ స్థాయిలో జరిగే నేరాలు అడ్డుకట్ట వేసేందుకు పనిచేస్తుంది. ఒకేచోట వలు ప్ర మాదాలు జరిగిన చోటును హాట్స్పట్గా గుర్తించి, వాటికీ గల కారణాలను తెలుసు కుని అవసరమైతే ఇతర శాఖల సమన్వ యంతో సమస్య పరిష్కారించేందుకు పోలీ సులు కృషి చేస్తున్నారు. అక్రమ ఇసుక రవా ణా, పీడీఎన్ బియ్యం, పేకాట స్థావరాలపై ఉక్కుపాదం మోపేందుకు రంగం సిద్ధం చేశారు.