04-04-2025 12:40:19 AM
న్యూఢిల్లీ, ఏప్రిల్ 3: భారత దిగుమతులపై అమెరికా ప్రభుత్వం విధించిన దిగుమతి సుంకాలతో భారత్‌పై ప్రభావం పెద్దగా ఉండదని ఎస్బీఐ తన పరిశోధన నివేదికలో పేర్కొంది. భారత్‌పై అమెరికా 27శాతం సుంకాలు విధిస్తుండగా ఇదే సమయంలో చైనాపై 34శాతం, వియత్నాంపై 46శాతం, బంగ్లాదేశ్‌పై 37శాతం, థాయ్‌లాండ్‌పై 36 శాతం టారిఫ్‌లు విధిస్తున్నట్టు ప్రకటించింది.
శ్వేతసౌధం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం భారత్ నుంచి ఎగుమతి అయ్యే స్టీల్, అల్యూమినియం, ఆటో మొబైల్ ఉత్పత్తులపై అమెరికా 25 శాతం టారిఫ్‌లు విధించనుండగా, ఫార్మా, సెమీకండక్టర్, కాపర్, ఎనర్జీ ఉత్పత్తులపై అసలు సుంకాలే లేవని ఓ ప్రకటనలో జీటీఆర్‌ఐ వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ పేర్కొన్నారు.
పై దేశాలతో పోల్చితే ఆయా రంగాలపై భారత్‌లో తక్కువ టారిఫ్ ప్రభావం ఉండటం దేశానికి వస్తుందని అభిప్రాయపడ్డారు. చైనా, బంగ్లాదేశ్, వియత్నాం వంటి దేశాలపై అమెరికా పెద్ద మొత్తం లో టారిఫ్‌లు విధించడం ద్వారా భారత్‌లోని టెక్ట్స్‌టైల్స్, గార్మెంట్ రంగానికి మేలు జరుగుతుందని అజయ్ శ్రీవాస్తవ అభిప్రాయపడ్డారు.
ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం భారత్‌లో మరింత అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. సెమీ కండక్టర్ తయారీ కంపెనీలు తైవాన్ నుంచి తమ కార్యకలాపాలను భారత్‌కు తరలించే అవకాశం ఉందని వివరించారు.
అమెరికా ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం
టారిఫ్‌ల అంశం దీర్ఘకాలంలో అమెరికా ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అభిప్రాయపడ్డారు.
భారత ఎగుమతులపై అమెరికా సుంకాలు
ఉత్పత్తులు సుంకాలు
స్టీల్, అల్యూమినియం, ఆటోమొబైల్స్ : 25 శాతం
ఫార్మా, సెమీకండక్టర్, కాపర్, ఎనర్జీ పరికరాలు : శూన్యం
ఇతర ఉత్పత్తులు : 27 శాతం