calender_icon.png 25 April, 2025 | 4:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇరవెండిలో బొడ్రాయి, ముత్యాలమ్మ తల్లి, అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ

24-04-2025 08:42:59 PM

రూ.1 లక్ష విరాళం అందించిన తాళ్లూరి చారిటబుల్ ట్రస్ట్..

బూర్గంపాడు (విజయక్రాంతి): బూర్గంపాడు మండలం ఇరవెండిలో నాభిశిల బొడ్రాయి ప్రతిష్ఠ, ముత్యాలమ్మ తల్లి, అభయాంజనేయ స్వామి విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. తాళ్లూరి చారిటబుల్ ట్రస్టు అధ్యక్షుడు తాళ్లూరి పంచాక్షరయ్య గురువారం పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల నిమిత్తం రూ.లక్ష విరాళం కమిటీ సభ్యులకు అందజేశారు.

తమ కుమారులు ప్రవాస భారతీయులు తానా మాజీ అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్, డాక్టర్ తాళ్లూరి రాజా శ్రీకృష్ణ సహకారంతో ఈ విరాళం అందించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు పంచాక్షరయ్యని శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో తాళ్లూరి ట్రస్టు డైరెక్టర్ వల్లూరిపల్లి వంశీకృష్ణ విజయరేణుక దంపతులు, బూర్గంపాడు పీఏసీఎస్ అధ్యక్షుడు బిక్కసాని శ్రీనివాసరావు, మాజీ సర్పంచ్ కొర్సా లక్ష్మి, గ్రామ పెద్దలు, స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.