calender_icon.png 28 December, 2024 | 7:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్మికుల ఆశలను వమ్ము చేసిన గుర్తింపు సంఘం

02-12-2024 06:17:16 PM

సీఐటియు నాయకులు..

మందమర్రి (విజయక్రాంతి): సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఇటీవల కార్పొరేట్ స్థాయిలో జరిగిన స్ట్రక్చరల్ సమావేశంలో కార్మికుల సమస్యలపై గుర్తింపు సంఘం యాజమాన్యంతో జరిగిన సమావేశంలో ప్రస్తావించక కార్మికులు, రిటైర్డ్, కాంట్రాక్టు కార్మికుల నమ్మకాన్ని గుర్తింపు సంఘం వమ్ము చేసిందని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) బ్రాంచ్ అధ్యక్ష కార్యదర్శులు సాంబారు వెంకటస్వామి రాజేందర్ లు విమర్శించారు. గుర్తింపు సంఘం స్ట్రక్చరల్ సమావేశంలో ప్రస్తావించిన అంశాలు, కమిటీలు చైర్మన్ పరిధిలో అని దాటవేసిన పలు అంశాలపై అంగీకారం కుదిరిందని చెప్పుకోవడం సిగ్గు చేటన్నారు.

మైనింగ్ స్టాఫ్ వారికి సూటబుల్ జాబ్ ఇచ్చేందుకు అంగీకరించిన యాజమాన్యం ట్రేడ్స్ మెన్, ఈపీ ఆపరేటర్లకు ఇవ్వడానికి అడ్డంకులు చెబుతుందని వారు ప్రశ్నించారు. కార్పొరేట్ లో జరిగినట్లు ఏరియాలో జరిగిన సమావేశంలోనూ యాజమాన్యంను పూర్తిస్థాయిలో ఒప్పించడంలో గుర్తింపు సంఘం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. చలికాలంలో ఇవ్వాల్సిన గరం కోట్లను అరకొరగా యాజమాన్యం ఇస్తున్న కూడా పట్టించుకోవడం లేదని ఏరియా ఆసుపత్రిలో స్కానింగ్ కొరకు గర్భిణీ స్త్రీలు మంచిర్యాల వరకు వెళ్లి వస్తూ ఇబ్బందులు పడుతున్న పట్టించుకోలేదని ఆరోపించారు.కేకే1 డిస్పెన్సరీలో రక్త పరీక్షలు, ఫిజియోథెరపీ  సేవలను ఏర్పాటు చేసే చర్యలను చేపట్టాలని, కార్మిక నివాస గృహాలు ఎక్కువగా ఉన్నాయని కేకే ఓసిపి కార్మికులకు మునిసిపాలిటీ ప్రకారం ఇంటికిరాయి చెల్లించకపోయినా గతంలో ప్రాతినిధ్య సంఘం ఉండి, ఇప్పుడు గుర్తింపు సంఘంగా ఎన్నికైన ఎలాంటి ఒత్తిడి చేయకపోవడం సరైనది కాదన్నారు.

కార్మికులకు హెల్మెట్, బూట్లు, వస్తువులు భద్రపరచుకోవడానికి సేఫ్టీ లాకర్లు లేక బైకులలో పెట్టుకుంటున్న పట్టించు కోవడంలేదని, గనులపై జరుగుతున్న సేఫ్టీ, మైన్స్ కమిటీ సమావేశాల మినట్స్ నోటీసు బోర్డుపై ప్రదర్శించడం లేదని విమర్శించారు. రిటైర్డ్ కార్మికులు 11వ వేతన ఒప్పందం జరిగిన ఇప్పటివరకు రివైజ్డ్ పెన్షన్ అమలు కాక చివరికి యూనియన్ ఆఫీసుల ముందు ధర్నా చేస్తామని అంటున్నా వారి సమస్యను పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. లాభాల వాటాను నవంబర్  27న చెల్లిస్తామని చెప్పి ఇప్పటివరకు వారి ఖాతాలో జమ చేయకపోవడం తగదన్నారు. ఇప్పటికైనా గుర్తింపు సంఘం నాయకులు గనిలో పనిచేస్తూ పని ప్రదేశాల్లో సమస్యలను తెలుసుకొని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బ్రాంచ్ ఉపాధ్యక్షులు రామగిరి రామస్వామి, నాయకులు అలవాల.సంజీవ్, జడల ప్రవీణ్, ఆదర్శ్, లింగాల రమేష్ లు పాల్గొన్నారు.