07-04-2025 01:18:59 AM
బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్
హైదరాబాద్, ఏప్రిల్ 6 (విజయక్రాంతి): శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ఆదివారం రాష్ట్ర ప్రజలకు మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. తండ్రిమాట జవదాటని పుత్రుడిగా, ఆదర్శవంతమైన రాజ్యపాలకుడిగా శ్రీరాముడు చేసిన త్యాగాలు, అనుసరించిన సంప్రదా య విలువలు ఎనలేనివని ఆయన కొనియాడారు.
హిందూ ప్రజల ఇలవేల్పుగా సీతారామ దంపతుల ఆదర్శాలు పూజనీయమని కేసీఆర్ అన్నారు. ఆదర్శ దంపతుల దీవెనలు తెలంగాణ ప్రజలపై కలకాలం ఉండాలన్నారు. మాజీ మంత్రులు కేటీఆర్, హారీశ్‌రావులు కూడా ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు.