calender_icon.png 7 February, 2025 | 6:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మన దేశ సిద్ధాంతాలు ఎంతో గొప్పవి

07-02-2025 12:00:00 AM

కోజికోడ్ ఐఐఎం  డైరెక్టర్ ప్రొఫెసర్ దెబాషిస్ ఛటర్జీ

చేవెళ్ల, ఫిబ్రవరి 6:  పురాతనమైన భారత దేశ సిద్ధాంతాలు ఎంతో గొప్పవని,  వీటిలో చాలా వాటిని జపాన్ లాంటి అభివృద్ధి చెందిన దేశాలు పాటిస్తున్నాయని  ఇండి యన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్,  కొజికోడ్ డైరెక్టర్ ప్రొఫెసర్ దెబాషిస్ ఛటర్జీ స్పష్టం చేశారు.

గురువారం శంకర్ పల్లి మండలం దొంతన్ పల్లిలో ని ఇక్పాయ్ పౌండేషన్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్  విశ్వ విద్యాలయం ప్రాంగణంలో 15 వ్యవస్థాపన దినోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారుసంస్కృతులు, భాషలు  ఎంతో విజ్ఞానాన్ని అందిస్తాయని, అవి అంతర్జాతీయ స్థాయికి ఏ మాత్రం తీసుపోవని పేర్కొన్నారు. 

ప్రస్తుతం ప్రపం చలో పేరొందిన బహుళ జాతి సంస్థలన్నీ భారతీయుల నేతృత్వంలో నడుస్తున్నాయని  గుర్తు చేశారు.  నాయకుడికి ప్రత్యేకమైన పంథా ఏమీ ఉండదని, తన అనుచరులను ప్రోత్సహిస్తూ వారి అభివృద్ధికి తోడ్పడే వారే నిజమైన లీడర్ అని అభిప్రాయపడ్డారు.

రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్, ఇక్పాయ్ చాన్స్ లర్ డాక్టర్ సి. రంగరాజన్ వర్చువల్గా ప్రసంగిస్తూ..  ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఒక దేశం మరో దేశం నుంచి నేర్చుకు నేందుకు సంకోచించకూడదని సూచిం చారు. ఇలాంటి ఆరోగ్యకరమైన వాతావర ణంలో ముందుకు సాగి అభివృద్ధి పంథా  వైపు పయణించాని ఆకాంక్షించారు.  

ఇక్ఫాయ్ వైస్ చాన్స్‌లర్ ఎల్ ఎస్. గణేశ్, ఇక్పాయ్ సంస్థ విశిష్ఠ సలహాదారు డాక్టర్ మహేందర్ రెడ్డి, ఇక్పాయ్ సొసైటీ చైర్ పర్సన్ శోభారాణి యశస్వీ,  హెచ్సీయూ వైస్ చాన్స్ లర్ బీజే. రావు, ఐబీఎస్ మాజీ డీన్ మెండు రామ్మోహన్ రావు, ఐఎంఐ మొబైల్ ఫౌండర్, జిడ్డు కృష్ణమూర్తి ఫౌండేషన్ సెక్రటరీ విశ్వనాథ్ అల్లూరి, రిజిస్ట్రార్ విజయలక్ష్మి, ప్రొఫెసర్లు, స్టూడెంట్లు పాల్గొన్నారు.