calender_icon.png 8 April, 2025 | 5:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేశానికే ఆదర్శం సన్నబియ్యం పథకం

07-04-2025 10:38:57 PM

ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్వేయం..

ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి..

కోదాడ: సన్నబియ్యం పథకం దేశానికే ఆదర్శమని ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని సన్న బియ్యం కార్యక్రమంలో భాగంగా 30వ వార్డులో షేక్ యాకూబ్ నివాసంలో ఏర్పాటు చేసిన సహపంక్తి భోజనం కార్యక్రమంలో వారితో కలిసి భోజనం చేశారు. సన్న బియ్యంతో చేసిన వివిధ రకాల వంటలు అమోఘమని అన్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలో నిజం లేదన్నారు. ప్రజా ప్రభుత్వంలో పేద ధనిక అనే తారతమ్యం లేకుండా ప్రజా పాలన చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని తెలిపారు. ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం అన్నారు. మాజీ ఎమ్మెల్యే చందర్ రావు, వంగవీటి రామారావు, మార్కెట్ చైర్మన్ ఏపూరి తిరుపతమ్మ సుధీర్, లక్ష్మీనారాయణరెడ్డి ఎర్నేనివెంకట బాబు, సామినేని ప్రమీల, కందుల కోటేశ్వరరావు, పార సీతయ్య, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.