హైడ్రా కార్యాలయంలో బక్కా జడ్సన్ ఫిర్యాదు
హైదరాబాద్ సిటీబ్యూరో, నవం బర్ 25 (విజయక్రాంతి): హైడ్రా కమి షనర్ ఏవీ రంగనాథ్ నివాసం ఉండే ఇల్లు ప్రస్తుత కృష్ణాకాంత్ పార్కు నిర్మించిన పెద్ద చెరువు బఫర్ జోన్ లోనే ఉన్నట్టు అందుకు సంబం ధించి న ఆధారాలతో సోమవారం హైడ్రా కార్యాలయంలో ఫిర్యాదు చేసి నట్టు బక్కా జడ్సన్ తెలిపారు. ఇదే విష యంపై సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న నేపథ్యంలో హైడ్రా కమి షనర్ ఏవీ రంగనాథ్ ఆదివారం ఒక ప్రకటనలో క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయ త్నం చేశారు.
దీంతో బక్కా జడ్స న్ మరోసారి తనవద్ద ఆధారాలు ఉన్నా యంటూ, రెండు నెలల పాటు కష్టపడి వం దేళ్ల నాటి మ్యాప్‌ను సంపాదిం చినట్టు తెలిపారు. యూసుఫ్‌గూ డ లోని కృష్ణకాంత్ పార్క్ సమీపంలోని ఏవీ రంగనాథ్ ఇల్లు చెరువు బఫర్ జోన్ పరిధిలోకే వస్తుందని ఫిర్యాదు లో పేర్కొన్నారు. హెచ్ఎండీఏ రూ పొందించిన జాబితాలో యూసుఫ్ గూడ పెద్ద చెరువు పేరు ఎందుకు లేద ని అధికారులను తప్పుబట్టారు.