calender_icon.png 22 March, 2025 | 11:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏనుగు అనుచరుల హల్‌చల్

22-03-2025 01:07:00 AM

  1. ఎమ్మెల్యే పోచారం పనితీరుపై నిరసన
  2. నిజామాబాద్ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత

కామారెడ్డి, మార్చి 21( విజయక్రాంతి): దశాబ్దాల నుంచి కాంగ్రెస్ జెండా మోసిన తమను పట్టించుకోకుండా, నిన్నగాక మొన్న బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన పోచా రం శ్రీనివాస్‌రెడ్డి తన అనుచరులకు అన్ని కాంట్రాక్టులు కట్టబెడుతున్నారని మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి వర్గీయులు శుక్రవారం చలో నిజామాబాద్ కలెక్టరేట్‌కు పిలుపునిచ్చారు.

ఉపాధిహామీ పథకం కింద మంజూరైన పనుల అప్పగింతలో కాంగ్రెస్ సీనియర్లను విస్మరిస్తున్నారంటూ ఏనుగు రవీందర్‌రెడ్డి వర్గీయులు ఆరోపిస్తున్నారు. శుక్రవారం ఉదయం బాన్సువాడ నియోజకవర్గంలోని 9 మండలాలకు చెందిన దాదాపు వెయ్యి మంది ఏనుగు రవీందర్‌రెడ్డి వర్గీయులు వాహనాల్లో నిజామాబాద్ కు తరలివెళ్లారు.

కలెక్టరేట్ ముందు బైఠాయిచి నిరసన వ్యక్తం చేశారు. మూడు దశాబ్దాలుగా బాన్సువాడ నియోజకవ ర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న పోచారం ఇటీవల బీఆర్‌ఎస్ బీఫామ్‌పై విజయం సాధించి ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి బీఆర్‌ఎస్‌లో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ డీలపడకుండా కాపాడుకున్నామని, ఆయన అనుచరులు పెట్టిన కేసులను భరి స్తూ పార్టీకి కట్టుబడి పనిచేశామని పోచా రం వర్గీయులు పేర్కొన్నారు.

బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి చేరిన నాయకులకు, కార్యకర్తలకు అక్రమ ఇసుక దోపిడికి అండగా నిలడటమే కాకుం డా, కొండలు మాయం కావడానికి పోచారం కారణమవుతున్నారని ఏను గు రవీందర్ రెడ్డి వర్గం ఆరోపిస్తోంది. ఇటీవల ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో సీసీ రోడ్లు, మురికి కాల్వల నిర్మాణం పనుల కోసం పెద్ద ఎత్తున నిధులు మంజూరయ్యాయి.

ఈ పనులను బాన్సువాడ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, కొన్నేళ్లుగా కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి ఉంటున్న వారిని కాకుండా, బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి చేరిన వారికి అప్పగిస్తున్నారని ఏనుగు రవీందర్ రెడ్డి వర్గం ఆరోపిస్తోంది. అంతేకాకుండా నియోజకవర్గ అభివృద్ధికి జిల్లా ఇన్‌చార్జి మంత్రితో మాట్లాడి ఏనుగు రవీందర్‌రెడ్డి రూ.6.50 కోట్లు మంజూరు చేయించగా..

ఆ నిధులు రాకుండా అడ్డుకుంటున్నారని వారు ఆరోపించారు. తక్షణమే ఆ నిధులు విడుద లయ్యేలా చూడాలని వారు డిమాండ్ చేశారు. బాన్సువాడ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ నాయకులు, పోచా రం చెప్పిన మాటలు విని ఎంతోమం ది నిరుపేదలు ఆస్తులు అమ్మి ఇళ్ల నిర్మాణాలు చేపడితే మూడేళ్లుగా నిధులు మంజూరు కాక, అప్పులు ఒక టికి రెండంతలు పెరిగి అనేక మంది ఇబ్బందులు పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వీటినన్నింటిని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు దృష్టికి తీసుకెళ్లడానికి చలో నిజామాబాద్ కార్యక్రమం చేపట్టినట్టు ఏనుగు రవీందర్ రెడ్డి వర్గం ప్రతినిధులు వెల్లడించారు.