calender_icon.png 19 April, 2025 | 3:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భార్యను నరికి చంపిన భర్త

10-04-2025 12:00:00 AM

అనుమానంతో ఘాతుకం

నల్లగొండ, ఏప్రిల్ 9 (విజయక్రాంతి): అనుమానం పెనుభూతమై వివాహితను బలితీసుకుంది. భార్యపై అనుమానంతో మద్యం మత్తులో భర్త ఆమెను దారుణంగా నరికి చంపాడు. నల్లగొండ జిల్లా అడవిదేవులపల్లి మండలం ముదిమాణిక్యం గ్రామం లో ఈ ఘటన జరిగింది. ముదిమాణిక్యం గ్రామానికి చెందిన పూజల బాల సైదయ్య కు, అదే గ్రామానికి చెందిన నర్సకుమారి (30)కి 15 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నాడు. బాలసైద య్య అడవిదేవులపల్లిలో పానీపూరి బండి నడుపుతుండగా.. నర్సకుమారి రోజువారీ కూలీకి వెళ్తూ జీవనం సాగిస్తున్నారు.

కొంతకాలంగా నర్సకుమారి ప్రవర్తనపై సైదయ్య అనుమానం పెంచుకోవడంతో గొడవ పడుతున్నారు. మంగళవారం రాత్రి సైతం దంప తుల మధ్య గొడవ జరిగింది. ఆ తర్వాత మ ద్యం మత్తులో విచక్షణ కోల్పోయిన సైద య్య అర్ధరాత్రి నిద్రిస్తున్న భార్యను కత్తిపీటతో నరికి హతమార్చాడు. భార్యను చంపి న విషయాన్ని ఉదయం తానే స్వయంగా పోలీసులకు ఫోన్ చేసి చెప్పాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శేఖర్ తెలిపారు.