19-04-2025 12:42:25 AM
కల్లూరు,ఏప్రిల్ 18:-పెనుబల్లి మండల పరిధిలో అటవీ ప్రాంతంలో ఉన్న నీలాద్రి గుడి ప్రాంగణంలో మూగ జివాలకు సత్తుపల్లి శాసనసభ్యులు డాక్టర్ మట్టా రాగమ యి దయానంద్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ ఆహారం అందిం చి, మానవత్వం చూపారు.మూగ జివాలకు ఆహారం అందించినప్పుడల్లా తమకు ఎం తో సంతోషం గా ఉంటుందని ఎమ్మెల్యే డాక్టర్ మట్టా దంపతులు తెలిపారు.ఫంక్షన్స్ లో ఒక వేళ ఆహారం మిగిలిపోతే వాటిని మీ దగ్గర లోగల మూగ జీవాలు ఉన్న ప్రాంతాలలో అందించాలని పిలుపుని చ్చారు.