calender_icon.png 5 March, 2025 | 7:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొత్త ఏడాదిలో హైదరాబాద్‌లో హౌసింగ్ రంగం మరింత జోరు

28-01-2025 01:30:21 AM

* అనరాక్ గ్రూపు చైర్మన్ అనుజ్‌పురి అంచనా

హైదరాబాద్ (విజయక్రాంతి):  కొత్త సంవత్సరంలోనూ హైదరాబాద్ గృహ ని ర్మాణం, అమ్మకాల విషయంలో తనఅగ్రస్థానాన్ని కొనసాగించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని  ప్రముఖ సంస్థ అనరాక్ గ్రూపు చైర్మన్ అనుజ్ పురి అభిప్రాపడ్డారు. 2025 సంవత్సరంలో దేశంలో గృహాల నిర్మాణం, అమ్మకాలు, ధరలకు సంబంధించి సంస్థ రూపొందించిన వార్షిక నివేదికలో ఆయన ఈ అభిప్రాయం వ్యక్తం చేశారు .

ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి నెలకొని ఉన్నప్పటికీ దేశం లోని ప్రధాన నగరాల్లో గృహ నిర్మాణాలు, విక్రయాలు మాత్రం కొత్త ఏడాదిలోనూ 2024 తరహాలోనూ వృద్ధి నమోదు చేయనున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ప్రభుత్వం తీసుకొంటున్న అనేక ప్రోత్సాహక  చర్యల ఫలితంగా హైదరాబాద్ నగరంలో రెసిడెన్షియల్ మార్కెట్ మరింత పుంజుకునే అవకాశాలున్నాయని ఆయన పేర్కొన్నారు.

ముఖ్యంగా ఫైనాన్షియల్ డి స్ట్ట్రిక్ట్, ప్రతిపాదిత హైదరాబాద్ ఎయిర్‌పోర్టు మెట్రో కారిడార్ చుట్టుపక్కల ప్రాంతాల అభివృద్ధి జోరందుకునే అవకాశాలు ఉన్నాయని, ఫలితంగా గృహనిర్మాణాల కార్యకలా పాలు పుంజుకోనున్నాయని పేర్కొన్నారు.  ప్రభుత్వం భారీ ఎత్తున చేపట్టనున్న మౌలిక సదుపాయాలతో పాటుగా ఉద్యోగాల కల్పన దీనికి దోహదం చేయనున్నాయని ఆయన పేర్కొన్నారు.

మిగతా నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో ఇప్పటికీ భూముల ధరలు తక్కువగా ఉండడం, వాణిజ్య కార్యకలాపాలు శరవేగంగా పెరుగుతుండడంతో న గరం అటు కొనుగోలుదారులతో పాటు ఇటు మదుపరులను ఆకర్షించడం కొనసాగుతూనే  ఉంటుందన్నారు. అలాగే రాబో యే రీజినల్ రింగ్ రోడ్డు వెంబడి  రాబోయే చిన్న చిన్న మార్కెట్లు కొత్తగా పెట్టుబడి అవకాశాలను ఆకర్షించనున్నాయి.

అలాగే ఇం టిగ్రేటెడ్ టౌన్‌షిప్, ఫ్యూచర్ సిటీ లాంటివి కూడా రాబోయే రోజుల్లో నగరంలో గృహనిర్మాణ కార్యకలాపాలు పుంజుకునేలా చేస్తాయనిఅనుజ్ పురి ఆ నివేదికలో అభిప్రాయపడ్డారు.