calender_icon.png 28 February, 2025 | 4:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జర్నలిస్టులు కట్టుకున్న ఇల్లు వారికే కేటాయించాలి...

28-01-2025 04:40:50 PM

అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం...

హుజురాబాద్ (విజయక్రాంతి): మా ఇల్లు మాకు కావాలి అనే నినాదంతో హుజురాబాద్ జర్నలిస్టులు చేపట్టిన నిరసన కార్యక్రమం మంగళవారం రెండో రోజుకు చేరింది. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ప్రెస్ క్లబ్ నుంచి ప్రారంభమైన ర్యాలీ ప్రభుత్వ ఆసుపత్రి మీదుగా అంబేద్కర్ చౌరస్తా వద్దకు చేరుకుంది. మా ఇల్లు మాకు కావాలంటూ జర్నలిస్టులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహానికి ప్రజాసంఘాల నాయకులతో కలిసి జర్నలిస్టులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ.. హుజురాబాద్ జర్నలిస్టులకు గత ప్రభుత్వం కేటాయించిన స్థలంలో కట్టుకున్న ఇళ్లను వారికే కేటాయించాలని ప్రజాసంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం ఎందుకు కాలయాపన చేస్తుందని వారు ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండి కథనాలు ప్రచురించే జర్నలిస్టులకే సమస్యలు తలెత్తితే సామాన్యుల పరిస్థితి ఏంటని వారు ప్రశ్నించారు.

ప్రభుత్వం స్పందించి వెంటనే జర్నలిస్టులకు కేటాయించిన స్థలాన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారికి ఈఎన్ సీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కలాలతో చెలగాటం మంచిది కాదని గుర్తు చేశారు. జర్నలిస్టులు చేపట్టే నిరసన కార్యక్రమాలకు తమ మద్దతు సంపూర్ణంగా ఉంటుందని, భవిష్యత్తులో జర్నలిస్టులు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్న వారికి తమ వంతు సహాయ సహకారాలు ఉంటాయన్నారు. జర్నలిస్టులకు కేటాయించిన స్థలంలో వేసిన కోర్టు కేసును కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రణవ్ బాబు, రాష్ట్ర బీసీ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ లు విరమించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ కన్వీనర్ గడ్డం ధర్మారెడ్డి, కో కన్వీనర్ లు కాయిత రాములు, నిమ్మటూరి సాయి కృష్ణ, టీయు డబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షుడు నంబి భరణి కుమార్, ఎలక్ట్రానిక్ మీడియా డివిజన్ అధ్యక్షుడు మక్సుద్, జిల్లా నాయకులు చిలుకమారి సత్యరాజ్, వేల్పుల సునీల్, బొడ్డు శ్రీనివాస్ తో పాటు సీనియర్ జర్నలిస్టులు కోరం సుధాకర్ రెడ్డి, మామిడి రవీందర్, అల్లి నరేందర్, మండల యాదగిరి, కామని రవీందర్, గుడూరు కొండల్ రెడ్డి, సురు కంటి తిరుపతిరెడ్డి, ప్రజాసంఘాల నాయకులు వేల్పుల రత్నం, జక్కని సంజయ్, సందుపట్ల జనార్ధన్, సిరిపాటి వేణు, రుద్రారపు రామచంద్రం, తూము వెంకట్ రెడ్డి, తునికి సమ్మయ్య, తునికి వసంత్, బత్తుల మనోజ్  తో పాటు ప్రెస్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.