07-03-2025 12:00:00 AM
నితిన్ హీరోగా నటిస్తున్న కామెడీ చిత్రం ‘రాబిన్‌హు డ్’. వెంకీ కుడుముల దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించారు. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్‌కుమార్ సంగీతం సారథ్యం వహిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుద లైన రెండు పాటలు చార్ట్‌బస్టర్ హిట్ అయ్యాయి.
తాజాగా మేకర్స్ థర్డ్ సింగిల్ అప్డేట్‌నూ ఇచ్చారు. ‘ది హాటెస్ట్ సర్‌ప్రైజ్ ఆఫ్ ది ఇయర్’గా పేర్కొంటూ ఈ స్పెషల్ సాంగ్‌ను మార్చి 10న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఈ ట్రాక్‌లో కేతికాశర్మ అల్ట్రా గ్లామరస్‌గా కనిపించనుందట.
సాంగ్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో కేతికశర్మ గ్లామరస్ లుక్ ఆకట్టుకుంది. నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రానికి సాయిశ్రీరామ్ సినిమాటోగ్రఫీ కాగా, కోటి ఎడిటర్‌గా, రామ్‌కుమార్ ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఈ సినిమా మార్చి 28న థియేటర్లలో విడుదల కానుంది.