calender_icon.png 31 October, 2024 | 12:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆసుపత్రి ఎరుగని తండా

18-07-2024 02:37:18 AM

  • 40 ఏళ్లలో కేవలం ఏడుగురే మృతి 
  • పాత పద్ధతిలోనే ఆహారం

కామారెడ్డి, జూలై 17 (విజయక్రాంతి): ఆ తండావాసులు ఇప్పటికీ పాత పద్ధతిలోనే ఆహారం తీసుకుంటారు. ప్రకృతి ఒడిలో.. ప్రశాంతగా బతుకుతున్నారు. ఇందులో విం తేం ఉంది అనుకుంటున్నారా? ఆ తండాలో చావుల పర్సంటేజీ చాలా తక్కువగా ఉండటమే. 40 ఏళ్లలో ఇక్కడ ఏడుగురు మాత్ర మే మృతిచెందారు. అదీ కరోనా సమయంలోనే.  పోసానిపేట పంచాయితీ పరిధిలోని గోకుల్‌తండా ప్రస్తుతం గ్రామ పంచాయతీగా ఏర్పడింది. తండాలో 110 ఇళ్లు ఉండ గా 1200 జనాభా ఉంది. అందులో 520 మంది ఓటర్లు  ఉన్నారు. ఇటీవలే గ్రామ పంచాయితీగా మారింది. 

పాత పద్ధతిలోనే ఆహారం..

తండావాసులు తినే తిండి, ఆహారపు అలవాట్లు ఇప్పటికీ పాత పద్ధతిలోనే కొనసాగిస్తున్నారు. అందుకేనేమో వారికి రోగాలు దరిచేరడం లేదు. అయితే ఇక్కడ నిరాక్షరాస్యత కూడా ఎక్కువే. బోరుబావుల వద్ద లభించే నీటినే అన్నిటికి ఉపయోగిస్తున్నారు. ఇక్కడ ప్రతీ ఇంట్లో జొన్న రొట్టెలు, ఎల్లిగడ్డకారంను ప్రతిరోజు వినియోగిస్తారు. దీంతో ఇప్పటికీ 90 సంవత్సరాల వృద్ధులు కూడా తండాలో వారి పనులు వారు చేసుకుంటూ హూషారుగా ఉన్నారు. తండాలోని అందరూ ఉదయం నుంచి సాయంత్రం వరకు వ్యవసాయ పనుల్లో నిమగ్నమవుతారు. తండాకు వచ్చే నిధులను సక్రమంగా ఖర్చుపెట్టే విధంగా గ్రామ యువకులు పర్యవేక్షణ చేస్తారు.

గ్రామానికి ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను సద్వినియోగం చేసుకుంటారు. వ్యవసాయంతో పాటు గొర్రెలు, మేకలు, గోవులను పెంచడం వంటి నరెలరె తండావాపెలె వృత్తిగా మలుచుకున్నారు. గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు ఇటీవల ప్రభుత్వ ఉద్యోగాలను పొందారు. అందరూ కలిసిమెలసి ఉంటూ ఎవరికి ఏ ఆపద వచ్చినా అదుకుంటారు. ఇంత ఆప్యాయంగా ఉంటే ఈ తండాలొ ఇటీవల పోడుభూముల పేరుతో అటవీశాఖ అధికారులు వచ్చి తమ తాతల నుంచి సాగుచేసుకుంటున్న భూములను  అటవీ భూములు అంటూ గుంజుకున్నారు. తమకు న్యాయం చేయాలని తండావాసులు అధికారులు, ప్రజాప్రతినిధులను కోరుతున్నారు.

మక్కరొట్టె, ఎల్లిపాయకారం తింటాం

మా తండాలో ప్రతీ కుటుంబం మక్కరొట్ట్టె, ఎల్లిపాయకారం ఎక్కువగా తింటుంది. జ్వరాలు, సూదులు, మందులు ఇక్కడ ఉండవు. అందరం కలిసిమెలిసి ఉంటూ వ్యవ సాయం చేసుకుంటాం. గత 40 ఏళ్లుగా తండాలో చనిపోయింది కేవలం ఏడుగురు మాత్ర మే. అదికూడా కరోనా వచ్చిన సమయంలోనే. మా భూములు ఇటీవల అటవీశాఖ అధికారులు వచ్చి పోడు భూములని గుంజుకున్నారు. మా భూములు మాకు అప్పగించాలి.   సాలియా, గోకుల్‌తండా, కామారెడ్డి

ఒకరికొకరు అండగా ఉంటాం

తండాలో ఎవరికి ఏ ఆపద వచ్చి నా అందరం కలిసి కట్టు గా అండగా ఉంటాం. పెళ్లిళ్ల సమయంలో డబ్బు లు లేనివారికి అందరం కలిసి ఆర్థిక సాయం చేస్తాం. గ్రామానికి ప్రభుత్వం నుంచి వచ్చే ఏ నిధులైనా సద్విని యోగం చేసుకుంటాం. పంచా యతీ భవన నిర్మాణంతో పాటు పైప్‌లైన్ పనులు పూర్తి చేసుకున్నాం. నీటి సమస్య లేదు. బోరునీళ్లనే తాగేందుకు ఉపయోగిస్తున్నాం.                -గోకుల్‌తండా