03-04-2025 06:07:23 PM
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో గురువారం కురిసిన వర్షానికి మండల కేంద్రంలోని పశు వైద్యశాల ప్రాంగణంలో వర్షపు నీరు నిలిచి చెరువుని తలపిస్తుంది. కొంత సమయం కురిసిన అకాల వర్షానికే వైద్యశాల ప్రాంగణం చుట్టూ అడుగు వేయలేనంత వర్షపు నీరు నిలుస్తే, వర్షాకాలంలో ఏ విధంగా ఉంటుందో ఈ పశు వైద్యశాల ఊహించుకోవచ్చు మాటలు సరిపోవు వర్ణించడానికి వైద్యశాల కోసం అని ప్రజలు అంటున్నారు.
ఇలాంటి వైద్యశాలకు ఏ విధమైన సేవ దొరుకుతుందని, డాక్టర్లు అందుబాటులో ఉండక, పరిసరాల పరిశుభ్రంగా ఉండక, వైద్యశాల మీద ఆశ కూడా పెట్టుకోలేకపోతున్నాం అని రైతులు, గ్రామ ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా పై అధికారులు స్పందించి వెంటనే శిధిలావస్థలో ఉన్న వైద్యశాలకు మరమ్మతులు చేసి డాక్టర్లు అందుబాటులో ఉండేలా చూడాలని రైతులు, గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు.