- ప్రజావాణికి దరఖాస్తుల వెల్లువ
- 31వ తేదీ నాటికి సర్వే పూర్తి కరీంనగర్ నగరపాలక సంస్థ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్
కరీంనగర్, డిసెంబరు 28 (విజయ క్రాంతి) : కరీంనగర్ జిల్లాలో 313 గ్రామ పంచాయతీలు, నాలుగు మున్సిపాలిటీలు, ఒక నగరపాలక సంస్థ కలిపి ప్రభుత్వం ఆరు గ్యారంటీలపై స్వీకరించిన దరఖాస్తు లు 3,22,264. ఇందులో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి 2,17, 180 దరఖా స్తులు వచ్చాయి. ప్రభుత్వం సంక్రాంతి నాటికి ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపును చేయాలని సంకల్పించి సర్వే ప్రారంభిం చింది.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల సర్వే కరీంనగర్ జిల్లాలో సాఫీగా సాగుతుంది. ఈ నెల 8న ప్రారంభ మైన సర్వే 31 వరకు కొనసాగనున్నది. క్షేత్రస్థాయిలో ఈ సర్వే కొనసాగుతున్నది. ఆరు గ్యారంటీలపై వచ్చిన దరఖాస్తుల ఆధారంగా ఇంటింటా సర్వే కొనసాగిస్తు న్నారు. ప్రతి 500 మందికి ఒక అధికారిని ఈ సర్వేకు నియమించారు.
గ్రామ పంచా యతీ, నగరపాలక సంస్థ, మున్సిపల్ ఉద్యోగులు, పంచాయతీ కార్యదర్శులు, బిల్ కలెక్టర్లు ఈ సర్వేలో పాల్గొంటున్నారు. కరీంనగర్ జిల్లాలో కరీంనగర్, చొప్పదండి, మానకొండూర్, హుజూరాబాద్ నియోజక వర్గాలు ఉన్నాయి. ప్రభుత్వం నియోజక వర్గానికి మొదటి విడతలో 3500 చొప్పున ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని, ఇందిరమ్మ ఇళ్లు కేటాయించిన వారికి 5 లక్షల ఆర్థిక సహాయం ఇవ్వాలని నిర్ణయించింది.
ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అరులైన వారికి ఇందిరమ్మ ఇళ్లు అందించాలన్న సంకల్పం తో పార్టీ తరపున ఇందిరమ్మ కమిటీలను కూడా నియమించింది. గిరిజనులు, పేదలు, వ్యవసాయ కూలీలు, దివ్యాంగు లు, అనాథలు, ఒంటరి మహిళలు, వితం తువులు, ట్రాన్స్ జెండర్లు, పారిశుధ్య కార్మి కులకు ప్రాధాన్యతాక్రమంలో కేటాయిం చాలనే యోచనలో ప్రభుత్వం ఉంది.
ప్రజావాణికి బోలెడు దరఖాస్తులు
ఇందిరమ్మ ఇళ్లపై ఓ పక్క సర్వే జరుగు తుండగా, మరో పక్క జిల్లా కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తులు వెల్లువ లా వస్తున్నాయి. అయితే ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపునకు భూ సమస్య ప్రధానంగా ఎదురయ్యే అవకాశం ఉంది.
ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకొని పంచకుండా మిగిలిన డబుల్ బెడ్రూంలను అరులైన వారికి కేటాయించాలనే ఆలోచన కూడా చేస్తున్నట్లు తెలిసింది. లబ్దిదారుల ఎంపిక యాప్ ద్వారా కొనసాగుతుండడంతో నిరుపేదలపై అరులు అయోమయానికి గురవుతూ ఆరు గ్యారంటీలతో ఇచ్చిన దరఖాస్తులతోపాటు ప్రజావాణిలో కూడా దరఖాస్తు చేసుకుంటున్నారు.
విజయవంతంగా పూర్తిచేయాలి
రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేప ట్టిన ఇందిరమ్మ నివాస గృహాల పథకం సర్వేను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆదర్శనగర్, సుభాష్‌నగర్, అంబేద్కర్ నగర్‌లో పర్యటించి తనిఖీ చేశారు. సర్వేపై ఆరా తీయడంతోపాటు సలహా లు, సూచనలు చేసి అరులైన లబ్దిదా రుల జాబితాను పకడ్బందీగా రూపొం దించాలని ఆయన ఆదేశించారు.