15-02-2025 01:51:14 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 14 (విజయక్రాంతి): తెలంగాణ ఉద్యమ చరిత్ర అంటే ఒక వ్యక్తి, ఒక కుటుంబం, ఒక రాజకీయ పార్టీ అన్నట్టుగానే కొందరు చరిత్ర రాసే ప్రయత్నం చేశారని సీఎం రేవంత్‌రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. విద్యార్థులు, యువ కుల త్యాగాలను చరిత్రలో లిఖించకుండా తెలంగాణ ఉద్యమ చరిత్రను తమకు అను కూలంగా మల్చుకునే ప్రయత్నం చేయడం దురదృష్టకరమన్నారు.
మాజీమం త్రి తూళ్ల దేవేందర్‌గౌడ్ రచించిన ‘విజయ తెలంగాణ’ పుస్తకావిష్కరణ కార్యక్రమం శుక్రవారం జలవిహార్‌లో జరిగింది. ఈ కార్యక్ర మానికి ముఖ్యఅతిథిగా సీఎం రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు, మంత్రి పొన్నం ప్రభాకర్, రాజ్యసభ సభ్యుడు కే లక్ష్మణ్, పుస్తక రచయిత దేవేందర్‌గౌడ్‌తో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి ‘విజయ తెలంగాణ’ పుస్తకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. అమరులు వారి గొప్పదనాన్ని, పోరాట స్ఫూర్తిని వారు లిఖించుకోలేరన్నారు. కానీ, తాము ప్రభుత్వంలోకి వచ్చాక రాష్ట్రం కోసం ఉద్యమించిన వారి గురించి ప్రత్యేకంగా చెప్పాలని అనుకున్నట్టు తెలిపారు. తెలంగాణను టీజీ రూపంలో రాయాలని ఆయనే చెప్పారన్నారు.
దీంతో టీజీని గోడలపై కాకుండా ప్రజలు తమ గుండెల్లో పెట్టుకున్నారన్నారు. ప్రజల ఆలోచన మేరకే టీఎస్‌ను టీజీగా చేశామన్నారు. ఒకప్పుడు రాజకీయాలు టెస్ట్ మ్యాచుల్లా ఉండేవని, ప్రస్తుతం టీ మారాయన్నారు. గోదావరి జలాలతోనే తెలంగాణ సస్యశ్యామలం అవుతుందని గుర్తించి దేవేందర్‌గౌడ్ పాదయాత్ర చేయ డం కారణంగానే అనాటి పాలకులు చేవెళ్ల ప్రాజెక్టును చేపట్టినట్టు తెలిపారు.
ఇది తెలంగాణ చరిత్ర అనీ, ప్రజలు అనుభవించిన కష్టాలను ప్రతిబింబించేలా రాశారని సీఎం కొనియాడారు. రచయిత తూళ్ల దేవేందర్‌గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు ప్రతి సమస్యను పోరాడి సాధించుకున్నారని, అందుకే ఈ పుస్తకానికి ‘విజయ తెలంగాణ’ అని పేరుపెట్టినట్టు తెలిపారు. భవిష్యత్ తరాలకు చరిత్ర తెలియాలనే ఉద్దేశంతోనే ఈ పుస్తకం రచించినట్టు చెప్పారు.