బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి
హైదరాబాద్, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై దాఖలైన అనర్హత పిటిషన్లపై హైకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు అని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. పార్టీ ఫిరా యింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని గతంలో కోర్టులో పిటిషన్ వేసినట్లు ఏలేటి తెలిపారు. ఇప్పటికైనా కోర్టు తీర్పునకు అనుగుణంగా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌ను కోరుతున్నామన్నారు.
తీర్పును మంత్రి పొన్నం స్వాగతించడాన్ని అభినందిస్తున్నామన్నారు. తీర్పును సీఎం రేవంత్‌రెడ్డి, ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే దృష్టికి తీసుకెళ్లి త్వరగా నిర్ణయం తీసుకునేలా ఒత్తిడి తీసుకురావాలని డిమాం డ్ చేశారు. గతంలో బీఆర్‌ఎస్.. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి చేర్చుకున్నప్పుడు దానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసిందని గుర్తు చేశారు. హైడ్రా ఆరం భ శూరత్వమని ముందే చెప్పామని, కావాలనే హైడ్రా కోరలను ముఖ్యమంత్రి పీకేశారని ఆరోపించారు.