calender_icon.png 20 November, 2024 | 7:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ చెల్లదన్న హైకోర్టు రాజ్యాంగ విరుద్ధం

20-11-2024 01:39:53 AM

  1. ఇప్పటికే ఉన్న వాళ్లను తొలగించొద్దు 
  2. భవిష్యత్‌లో నియామకాలు చట్టప్రకారమే ఉండాలి

హైదరాబాద్, నవంబర్ 19 (విజయక్రాంతి): కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ చెల్లదని మంగళవారం హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. క్రమబద్ధీకరణ నిమిత్తం ప్రభుత్వం 1994 చట్టానికి సవరణ తీసుకువస్తూ సెక్షన్ 10 ను చేర్చడం సరికాదని, ఇది రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది.

సెక్షన్ 10 చేర్చుతూ 2016లో ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 16ను రద్దుచేసింది. కాంట్రాక్ట్ కింద కొనసాగుతున్న జూనియర్ లెక్చరర్లు, డిగ్రీ లెక్చరర్ల సర్వీసులను క్రమబద్ధీకరించడంపై పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై జస్టిస్ సుజయ్‌పాల్, జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావుతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.

పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. 2002 నుంచి జూనియర్, డిగ్రీ లెక్చరర్లను అధికారులు దొడ్డిదారిన నియమిస్తున్నారని తెలిపారు. కాలేజీ డెవలప్‌మెంట్ కమిటీ కింద కాంట్రాక్ట్ నియామకాలు జరిగాయని, తరువాత క్రమబద్ధీకరణ జరిగిందని చెప్పారు. ఈ పోస్టులకు ఎలాంటి నోటిఫికేషన్ జారీ చేయలేదని, అర్హతలు పేర్కొనలేదని అన్నారు.

చట్టానికి సవరణ తీసుకువచ్చే అధికారం ప్రభుత్వానికి లేదని పేర్కొన్నారు. ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తూ.. రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 101 కింద కొత్త సెక్షన్ చేర్చే అధికారం ఉందని తెలిపింది. ఉద్యోగుల పరిస్థితులతో సహా అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ ఒక్కసారికి ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు తెలి పింది.

ఇరుపక్షాల వాదనలను విన్న ధర్మాసనం ప్రభుత్వ వాదనతో విబేధిస్తూ క్రమబద్ధీ కరణకు అనుసరించిన విధానం ఆమోదయోగ్యం కాదని తేల్చి చెప్పింది. చట్టబద్ధమైన నిబంధనలున్నపుడు వాటికి సమాంతరం గా మరో భిన్నమైన నిబంధనను చేర్చడం సరికాదంది. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ చట్టం దృష్టిలో సరికాదని, ఇది ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకమని తెలిపింది.

సవరణ ద్వారా చేర్చిన సెక్షన్ 10 రాజ్యాంగ విరుద్ధమని, దీని కింద నియామకాలు చెల్లవని చెప్పింది. జీవో 38 కింద దాదాపు 5,544 మంది ఉద్యోగుల క్రమబద్ధీకరణ జరిగిందని, బహుళ ప్రజాప్రయోజనాలను పరిగణనలోకి తీసుకున్నందున వారిని తొలగించరా దని తీర్పు వెలువరించింది. సెక్షన్ 10 పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 101 కింద లభించిన అధికారంతో తీసుకువచ్చామన్న ప్రభుత్వ వాదనతో ధర్మాసనం విభే దించింది.

ఎడ్యుకేషన్ సర్వీసు నిబంధనల రద్దు, సవరణలు జరగకుండా సెక్షన్ 10 తో కొత్త నిబంధనలు తీసుకురావడం, సరికొత్త అర్హతలను నిర్ణయించడం సరికాదని పేర్కొంది. క్రమబద్ధీకరణకు సంబంధించి దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు, సుప్రీం కోర్టులు కొట్టివేశాయని..

అందువల్ల తేల్చిన అంశంపై తిరిగి విచారణ చేపట్టరాదన్న ప్రతివాదుల వాదనతో ధర్మాసనం విభేదించింది. కేసు పూర్వాపరాల్లోకే కోర్టులు వెళ్లలేదని, కాంట్రాక్ట్ కింద నియమితులైనవారిని ప్రతివాదులుగా చేర్చలేదని, అందువల్ల గతంలో తేల్చిన అంశంగా పరిగణించరాదంది. 

ఇప్పటికే ఉన్నవారని కొనసాగించాలి

ప్రస్తుతం క్రమబద్ధీకరణ పూర్తయిన ఉద్యోగులను తొలగించాలని ఆదేశాలివ్వలేమని ధర్మాసనం తెలిపింది. ప్రస్తుత కేసుల ప్రకారం క్రమబద్ధీకరణ జరిగినవారిని తొలగించి పిటిషనర్లతో నియమించాలని ఆదేశాలి వ్వాల్సి ఉందని, అయితే వాళ్లను తొలగించాలని ఏ ఒక్క పిటిషన్లోనూ ఎవరూ కోరలేదం ది.

అంతేగాకుండా క్రమబద్ధీకరణ జరిగిన పోస్టులను ప్రకటన ద్వారా భర్తీ చేయాలనీ కోరలేదంది. ఇక్కడ క్రమబద్ధీకరణ ఉద్యోగులు 2009లో నియమితులయ్యారని, 15 ఏళ్లకుపైగా సర్వీసులో ఉన్నారని చెప్పింది. ఈ దశలో తొలగిస్తే వారికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని పేర్కొంది.  

హైకోర్టు తీర్పుపై అధ్యాపక సంఘాల హర్షం 

హైదరాబాద్: హైకోర్టు తీర్పుతో ప్రభుత్వ ఉద్యోగులుగా రెగ్యులరైజ్ అయిన అధ్యాపకులు, ఉద్యోగులు ఊపిరిపీల్చుకున్నారు. కాంట్రాక్ట్ అధ్యాపకుల క్రమబద్ధీకరణ జీవో నంబర్ 16పై హైకోర్టు వెలువరించిన తీర్పుపై తెలంగాణ గెజిటెడ్ లెక్చరర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కనక చంద్రం, తెలంగాణ గెజిటెడ్ జూనియర్ లెక్చరర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి డాక్టర్ కొప్పిశెట్టి సురేశ్, ప్రభుత్వ మైనారిటీ అధ్యాపక సంఘం రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ జబీ హర్షం వ్యక్తం చేశారు.

జీవోను కొట్టివేసిన న్యాయస్థానం ఇప్పటికే క్రమబద్ధీకరణ అయిన ఉద్యోగులను తొలగించొద్దని స్పష్టంచేసినట్లు వారు వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. గత 24 ఏళ్లుగా కాంట్రాక్ట్ లెక్చరర్లుగా పనిచేసిన వీరిని గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రెగ్యులరైజ్ చేసింది. అయితే ఆ జీవో చెల్లదంటూ కొందరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

కోర్టులో తమకు అనుకూలంగా తీర్పు రావడం సంతోషకరమని యూనియన్ అధ్యక్షుడు కనకచం ద్రం హర్షం వ్యక్తం చేశారు.  రాష్ట్రంలోని మొత్తం 40 ప్రభుత్వ విభాగాల్లో ఉన్న 5,544 మంది వరకు కాంట్రాక్టు అధ్యాపకులు, ఉద్యోగులను గత ప్రభుత్వం క్రమబ ద్ధీకరించింది. ఇందులో 2,909 మంది జూనియర్ లెక్చరర్లు, 390 మంది పాలిటెక్నిక్ అధ్యాపకులు, 184 మంది జూనియర్ ఓకేషనల్ లెక్చరర్లు, 270 మంది డిగ్రీలెక్చరర్లు, 131 మంది సాంకేతిక విద్యాశాఖలోని అటెండర్లు ఉన్నారు.

వైద్యారోగ్యశాఖలో 179 మంది ల్యాబ్ టెక్నీషియన్స్, 158 మంది ఫార్మాసిస్టులు, 837 మంది వైద్య సహాయకులు, 230 మంది సహాయ శిక్షణాధికారులు ఉన్నారు. క్రమబద్ధీకరణ కోసం గత ఏడాది నుంచి ఎదురు చూస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులకు మాత్రం నిరాశే మిగిలింది. తాము సుప్రీం కోర్టును ఆశ్రయించే ఆలోచనలో ఉన్నట్టు యూనియన్ నాయకులు డాక్టర్ కొప్పిశెట్టి సురేశ్ తెలిపారు.