calender_icon.png 4 February, 2025 | 4:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రహస్యభేటీపై అధిష్ఠానం సీరియస్

04-02-2025 01:26:25 AM

  1. రేపు వస్తా.. అప్పటిదాకా మాట్లాడొద్దని ఆదేశం
  2. ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ ఫోన్ 

హైదరాబాద్, ఫిబ్రవరి 3 (విజయక్రాంతి): కాంగ్రెస్ ఎమ్మెల్యేల రహస్య సమావేశ అంశం.. పార్టీ అధిష్ఠానం పెద్దల వరకూ వెళ్లింది. పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా సమావేశం కావడానికి గల కారణాలు ఏమిటనే అంశంపై ఢిల్లీ పెద్దలు ఆరా తీసినట్టు సమాచారం. ఈ విషయంపై పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ కూడా స్పం దించి.. ఎమ్మెల్యేలకు ఫోన్ చేసినట్టు తెలిసింది.

ప్రస్తుతం ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో ఉన్నందున బుధవారం రాష్ట్రానికి వస్తానని, తాను వచ్చేవరకు ఈ అంశంపై ఎవరూ, ఎక్కడా మాట్లాడొద్దని దీపాదాస్ మున్షీ ఆదేశాలు జారీచేసినట్టు సమాచారం. ఇదే అంశంపై పీసీసీ అధ్యక్షు డు మహేశ్‌కుమార్‌గౌడ్ సైతం ఆదేశా లు జారీచేశారు. అయినప్పటికీ కొంద రు ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడటంతో అధిష్ఠానం కూడా సీరియస్ అయినట్టు సమాచారం.

ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో మంత్రులతో సమావేశం సందర్భంగా ఎమ్మెల్యేల రహస్య భేటీపైనా చర్చించినట్టు తెలిసింది. ఈ విషయంలో అధిష్ఠానం నిర్ణయం మేరకు ముందుకు సాగాలని నిర్ణయించినట్టు సమాచారం. మంత్రు లు, ఎమ్మెల్యేలు సమన్వయంతో ముందుకు వెళ్లాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

కాగా, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరు ద్‌రెడ్డి నేతృత్వంలో ఎమ్మెల్యేలు భూపతిరెడ్డి, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, కే రాజే శ్‌రెడ్డి, పటోళ్ల సంజీవరెడ్డి, దొంతి మాధవరెడ్డి, మురళీనాయక్, మేఘారెడ్డి మూడు రోజుల క్రితం హైదరా బాద్ శివారులోని ఒక ప్రైవేట్ హోటల్‌లో జరిగిన భేటీలో పాల్గొన్నారు.

ఈ రహస్య సమావేశంలో ఒక మంత్రి కి వ్యతిరేకంగా చర్చించినట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ వార్తలను కాంగ్రెస్ నేతలు కొందరు కొట్టిప డేశారు. అయితే తాము రహస్య సమావేశం ఏర్పాటు చేయలేదని కొం దరు చెప్పగా, మరి కొందరు మాత్రం పార్టీ ఎమ్మెల్యే ఇచ్చిన విందుకు మా త్రమే హాజరయ్యామని పేర్కొన్నారు.